పుట:Delhi-Darbaru.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XV కారణమును బట్టియు నీగ్రంథమునకు 'ఢిల్లీ దర్బారు, అనినామ కరణము సేయుట సహజమని మాచదువరులకు విశదము గాక మానదు.

ఈ గ్రంథము రచించుటయందు అసంఖ్యేయపు స్తకముల యుఁ 'ఒత్రిక లయు సాహాయ్యము గొనవలసివచ్చినది. అందు ముఖ్యములగునవి వేరొకచో నాంగ్లేయ భాషయందుఁ బేర్కొ నఁబడినవి.

గ్రంథనిరాణమునఁ దోడయిన గ్రంథకర్తలకును విలేఖ కులకును, వ్రాత ప్రతి సవలోకించి సాహాయ్యమిచ్చిన మ. రా. వేమవరపు రామదాసుపంతులు బి. ఏ., బి. ఎల్. గారికిని, ఇందలి కొన్ని పటముల దిమెల (Blocks) నొసంగినందులకు గాడ్డి యక్ ముద్రాక్షర శాలాధి పతులకును, తమముద్రాకుర శాలయందు నీగ్రంథము ముద్రితమగు నెడ నెంతో శ్రమ ప్రయా' సలకోర్చి బహు స్వల్ప కాలమున నుల్లాసముతోఁ దీనిని సంపూ 8 చేసి యిచ్చిన బ్రహ్మశ్రీ వేదము "వేక టరాయ శాస్త్రుల వారి కిని, మిక్కిలి యోర్పుతో అచ్చు చిత్తులను దిద్ది సాయపడిన .శ్రీయుత ఆదిరాజు వీరభద్రరావు గారికిని నందనము లొనర్చు, చున్నాము.

సం పాదకుడు