పుట:Delhi-Darbaru.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

• హైదరా బాదుసంస్థానము.


వచ్చును. లేదా ఆ ఫసలీకి నైజామునకు వీరియ్యవలసిన పేష్ కష్ నుండి తగ్గించుకొనవచ్చును. ఇట్టి నిబంధనలతో టిప్పూసుల్తా నుతో విగ్రహము ప్రారంభమాయెను. ' కాని యది బహుకా లము నడచినదికాదు. 1792లో టిప్పూసుల్తాన్ సంధి చేసు కొనవలసిన వాఁడయ్యెను. అప్పుడతఁడు దన రాజ్యములో సగ మువంతు శత్రువులకప్పగించి వేసెను. దానిలో నై జామునకు చెందిన భాగము నంవత్సరమునకురు 52, 64, 000 ఆదాయము నిచ్చునదయి యుండెను.

మహారాష్ట్రులు డీకొనుట.

టిప్పూసుల్తానులో, విగ్రహము ప్రారంబ మగు నప్పుడే నైజామలీకిని మహా రాష్ట్రులకును సంబంధము మై త్రిగలదిగ నుండ లేదు. కావున మహారాష్ట్రులు దన తో డను ఆంగ్లేయులతోడను జేరినట్లు చేరి తాను టిప్పూసుల్తా నుతోఁ బోరాడుచుండఁ దన దేశమును గొల్లకొట్టుదురేమో యని నైజాము భయపడి అట్టి దేమియు జరుగకుండ అభయమిమ్మని లార్డు కారన్ వాలీసును వేడెను. 'కాని యతఁ డదాని కంగీకరింపఁడయ్యెను. టిప్పూతోఁ బోరాటము ముగిసి ముగియక మున్నె నైజాము మసస్సున భయరూపముగనుండిన మహా రాష్ట్రుల దాడి నిజమయ్యెను. వీరికిని అతనికిని గొంతలావా దేవీలు నడచుచుండెడివి. అందులో నితఁడు వారికి బాకీపడుట తటస్థించెను. కావున వారు దమహక్కును సాధించుకొన నీతని