పుట:Delhi-Darbaru.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

హైదరాబాదుసంస్థానము.


నుండి కొంత కాల ముత్తర సర్కారుల మాట యె యెత్తుకొన లేదు. నైజామునకును నాంగ్లేయులకును నిశ్చయసం బంధ ముండినది గాదు. 1788 న సంవత్సరమున గుంటూరు జిల్లా ప్రశ్న మ ఱల బయలు దేరెను. గవర్నరు జనరలుగారు యుద్ధము చేసి యైనను సాధింప నాయత్తపడిరి. అంతట నైజాము పోరు' నొల్ల నివాఁడయినందుననాంగ్లేయవ ర్తక సంఘము వారి కా జిల్లానిచ్చి లెక్కలు చూచుకొని తీర్మానము చేసికొనెను.

మూఁడవ మైసూరు యుద్ధము,

ఈ తరుణమున 3 1768 వ సంవత్సరపు సంధిని గుఱించి. దాని విషయములు బోధపడఱచుచు గనర్నరు జనరలుగా నుండిన ' లార్డుకారన్ వాలీసు నైజామున కొక యుత్తరము వ్రాసెను. అదియు నైజూమునకును నా గ్లేయులకును జరిగిన సంధి పత్రము లలో నొక్కటిగ నెన్నఁబడుచున్నది. దాని వలన కారణ వా లీసు నైజూమును జాలవరకుఁ దృప్తి పనిచె ననుటకు సంది యము లేదు. ఇంతియెగాదు. ఈతరుణమున నే ఆంగ్లేయులు దము రెసి డెంటు హైదరాబాదున నుండునట్లును నేర్పరుచుకొనిరి.1789-న సంవత్సరమున 'హైదరు కుమారుఁడగు టిప్పూసుల్తానుతో నా గ్లేయులకు విగ్రహము గలిగెను. వైజా మేదో యొక పక్షముఁ జేరి తీరవలసి వచ్చెను. టిప్పూపక్షమున నుండుట కతనికి టిప్పూపై నమ్మకము చాలకపోయెను. వాఁడు జయిం