పుట:Delhi-Darbaru.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరునకై తగవులు,

125


గవర్నరు జనరల్ గా రొప్పుకొనక పోవుటచే "నాజిల్లా మరల నైజాము స్వాధీనము చేయఁబడియెను. ఇంతియెగాక యితనిని సనూధానపఱచుట కాంగ్లేయులు మిక్కిలి పరిశ్రమఁ జేసిరి. వారి స్థితి యప్పు డంత బాగుగ నుండ లేదు. కావున నైజాము నకు దగినంత హితోపదేశమునకు వీరు పూనుకొనవలసి వచ్చెను. వీరి ప్రయత్నములు వృధకాలేదు. 'హైదరు 'ఆంగ్లే యులతో గడపటి యుద్ధము చేసినపుడు నైజా మతనితో గలియ లేదు. 1782 వ సంవత్సరమున బజలత్ జంగు మరణ మందెను. వెటనే గుంటూరు జిల్లా యాంగ్లేయుల స్వాధీ నము చేయఁబడి యుండవలెను. కాని నైజాము దానిని తానే యుంచుకొనెను. 1784 వ సంవత్సరమున నాంగ్లేయవర్తక సం ఘమువారు 'జాన్ సన్ అను నతనిని నైజాము వద్దనుండి గుంటూరు జిల్లాను రాఁబట్టుట కనిపిరి. అప్పుడు నైజాము 1768వ సంవత్సరపు సంధి ననుసరించి యాంగ్లేయులకుఁ జెందిపో యిన ఉత్తర సర్కారులను వారు మరలఁ దన కియ్య వలసిన దనియు దానికై యప్పటివఱకు వారు దన కప్పుపడిన గుత్త మొత్తమును వదలి వేయుటయేగాక యొక కోటి రూపాయిలు బహుమతిగా నిత్తుననియు ఒక క్రొత్త బేరమునకు మొదలిడెను. పాపమాజాన్ సన్ దానినంతయును నామోదించుచు డైరెక్ట. రుల సమ్మతికయి 'యనిపెను. వారది గనినతోడనె మండిపడి జాక్ సన్ ను దీవ్రగతిఁ దూలనాడి పనినుండి తీసివై చిరి. అప్పటి