పుట:Delhi-Darbaru.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరునకై తగవులు.

123


బజలు 1779వ సంవత్సరమున మరల నైజామలికొక చిక్కుతట. స్థించెను. ఉత్తర సర్కారులకుఁ జేరిన గుంటూరు అతని తమ్ము డగు బజలత్ జంగునకు జహగీరుగా నియ్యఁబడెననియు నది సం ధుల ప్రకారము కొన్ని షరత్తులతో అతని మరణానంతర మాం గేయులకుఁ జేరనలసినదిగా నుండెననియు మాచదువరు లిది వటికే యెఱింగియున్నారు. 1774 వ సంవత్సరమున బజలత్ జంగు కొందఱు 'ఫ్లెచి సైనికులను తనకొలువులోనికి తీసి, కొనెను. 'ఆతనికి యజమానిగ నుండిన నైజామలీ ఆంగ్లేయుల తోఁ జేసికొనిన యొడంబడికల ననుసరించి ఫ్రెంచివారిని దీసి వేయుమని తనతమ్మునకు వ్రాయవలసిన వాఁడయ్యెను. బజల త్ జంగీ యుత్తరువును లక్ష్యపెట్టిన వాఁడు గాఁడు. కాని యైదు సంవత్సరములకుఁ దరువాత ననఁగా 1779 వ సంవ త్సరమున హైదరాలీ దెబ్బకుఁ దాళజూలక బజలత్ జంగు ఫ్రెంచివారిని దన సేననుండి తొలఁగించి వైచి యాంగ్లే యులతో సంధి చేసికొని వీరి పటాలములను దనజహ గీరులో నుంచుకొనెను. ఇంతటితో నిలువక యతఁ డాంగ్లేయు లకు గుంటూరు జిల్లాను కౌలున కిచ్చుటఁగూడఁ దటస్థించెను. 1768 వ సంవత్సరపు సంధి ననుసరించి బజలత్ జంగు మరణా నంతరమో లేక నైజాముగారి యుత్తరవు మీఁదనో గుంటూ రాం గ్లేయులకుఁ జెందవలసి యుండ వారీరీతి నైజామునకుఁ