పుట:Delhi-Darbaru.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

హైదరాబాదుసంస్థానము.


రాష్ట్రులకు . లంచమిచ్చి సలబత్ జంగు వారినుండి తప్పించు కొనెను. ఈరీతి నితఁడు దక్కుకొని ఫ్రెంచి వారి మాటే యధి కారముగఁ బరిపాలించు చుండెను.కాని ఫ్రెంచివారి కిని ఆంగ్లేయులకును దక్ష్మిణ హిందూస్థానములో జరిగిన పోరాటములో ఫ్రెంచివా రపజయమునందుచు వచ్చినం దున . వారు హైదరాబాదునుండి తమబలముల మరలించు కొను వారయిరి. సలబత్ జంగున కీసాయము పోవుటొక్కటి యెగాక - మఱియొక కష్టము చూపట్టెను. (ఫ్రెంచివారు వల దను చుండినను గూడ తాను రాజధానియందు లేనితటి తన తమ్ము డయిన నైజామలీకి సధికార మిచ్చుచుండెడు వాఁడు. దానివలన సతఁడు బలవంతుఁ డై తన్ను పదభ్రష్టుం జేయ సమ యము వేచియుండుట సలబత్ జంగుకు విశదమయ్యెను. కావున సతఁడు 1759వ సంవత్సరము మే నెలలో నాంగ్లేయులతో సంధి చేసికొనెను. దానినలన నైజాము చుట్టుంగల ఎనిమిది జిల్లా లతోఁగూడ మచిలీపట్టణ సీమయు, నిజాము పట్టణ సీమయు కొండవీడు వకలమన్నూరు జిల్లాలును, నాంగ్లేయవ ర్తక సంఘ మువారికి ఇనాముగా నిచ్చి వేసెను. ఫ్రెంచివారిని దన దేశము నుండి వెడలఁగొట్టెదనని వాగ్దానము చేయుటయే గాక ఆంగ్లే యుల శత్రువులకు శరణమిచ్చుటగాని 'సాయముచేయుటగాని లేదని యొప్పుకోనెను. ఆంగ్లేయవర్తక సంఘమువారును . నైజాముగారి శత్రువులకు శరణమిచ్చుటగాని వారికి సాయ