పుట:Delhi-Darbaru.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

హైదరాబాదుసంస్థానము.


స్థానిక పరిపాలకున కుత్తరువిచ్చెను. వాడును నట్లే చేయఁ బ్రయ త్నించియు ఆసఫ్ జా చేతిలోఁ జిక్కీ- మృతుఁడయ్యెను. ఆసఫ్ జా బాదుషాహగారి కీవిషయ మేమియుఁ దెలియదని నమ్మినట్లే నటిం చుచు నాపరిపాలకుని శిరస్సును వారికిఁ బంపి బాదుషాహగారి పై తిరుగుబాటు చేయ నెంచిన ద్రోహిని తాను దునుమాడిన టులఁ దెలియ చేసెను. ఇప్పగిది నామమాత్రమునకుఁ దాను 'బా దుషాహగారి ప్రతినిధియనియే యొప్పుకొనుచు నిజమునకు ఆస ఫ్ జా సర్వస్వాతంత్ర్యములును గలవాఁడయి నైజాము సంస్థాన మును స్థాపించెను..[1]

సింహాసనమున కై కలహములు.

1784 వ సంవత్సరమున ఆసఫ్ జా గతించి పోయెను. అప్పటికి హైదరాబాదు సంస్థానము నేఁడెంతగలదో యంతకంటే 'నెక్కు డుం డెనని చెప్పవచ్చును. నైజముల్ -ముల్ కు-ఆసఫ్ జూ చచ్చినతోడనె యధికారమునకై యతనికుమారులలో సంతః కలహములు పుట్టెను. మొదటికుమారుఁడు ఢిల్లీ నగరమున నుండి పోయెను. హైదరాబాదులోఁ దుడ్రి మరణకాలమున సిద్ధముగ నుండిన నాజర్ జంగ్ సైన్యముయొక్క- సాహాయ్యమువలన బొక్కసమును స్వాధీనపఱచుకొని రాజ్యమునకు వచ్చెను. ఆ సఫ్ జాకు మిక్కిలి ప్రియమైన కూతు రొక్కర్తె యుండెను. ..........................................................................................

1,

  1. ఢిల్లీలో బాదుషాహ పేరు నశించువఱకును హైదరాబాదు సవా బులు తాముదక్కను సుబేదారులనే వ్యవహరించుచుండిరి.