పుట:Delhi-Darbaru.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

113

నైజాము-అల్-ముల్క



యంతకంటె విశేష మేమియుఁ జేయవలసిన పని లేదు గదా.! హు సేనాలితోఁ గూడ చేరుకొని మహమ్మదు బాదుషాహ స్వయముగ దక్షిణమునకు దండు వెడలి వచ్చెను. మార్గమున శత్రువుల వ లన హుసేనాలి చంపఁబడుటయు, ఢిల్లీ నగరమున వైరులు మఱియొక చక్రవర్తిని నేమించుకొనుటయు సంభవించుట చే మహమదుషాహ వచ్చినం దారిఁ బట్టి తిరిగి ఢిల్లీ - జేరవలసిన వాఁడాయెను. గద్దెను శత్రుబలములనుండి దక్కిం చుకొనుటలో నితఁడు జయమం దెను. అప్పుడు మరల నాసఫ్. జాను ముఖ్యమంత్రి పదమున కితఁడు నియమించెను.కాని ఆసఫ్జా మాత్రము హైదరాబాదునందుఁ దనశక్తి స్థిరముగ నుండుటకు వలయు నుపాయము . లన్నిటిని వెదకి పన్ని ఢిల్లీకి - బయలు దేరి పోయెను. అచ్చట రాజ్యభారము నిర్వహించు టకు ఆసఫ్ జాకు సమ్మతము కాలేదు. సారము చెడి బెండువడి కుచ్చి తాత్ముల కాక రమయి యవగుణండగు మహమ్మదుషాహ చే సదష్టింపఁబడిన కొలువుకూట మెక్కడ? కార్యదక్షతకుఁ "బేరు గాంచిన యూరంగ జేబు కాలమునఁ బరిశ్రమచేసి బుద్ధి బలముల గడించిన ఆసఫ్ జా యెక్కడ ? కావున నె యీతఁడు గొంత కాల, ము ఢిల్లీలోనుండి యచట వర్ణింపనలవి కాని పెక్కు పాట్లు పడి కట్టకడపట 1724 వ సంవత్సరమున మరల హైదరాబాదు నకుఁ బయనమై పోయెను. అప్పుడు బాదుపాహ ఇతని కెదురుపడి కీడు చేయ మససురాక ఇతనిని జంపి వేయవలసినదని