పుట:Delhi-Darbaru.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

శ్రీ రా జ దం ప తు లు.



హిమాచ్ఛాదిత శిఖరములును, సుందరమగు నడవు లును, మహానదులును, ప్రాచీన శిల్పికా వైచిత్రములును, పురాతన గాథలును నాకాశ్చర్యమును బుట్టించెను. భారతీ యులు మిక్కిలి యోర్పు గలవారనియు, జీవనమున నాడం బగము లేని వారనియు, రాజభక్తి పరులనియు, దైవభక్తి పూర్ణ లనియు నాకు దృఢమగు నమ్మకము కలిగినది. మన పరిపాలన న్యాయపరిపాలనయనియు ధర్మ పరిపాలన యనియు విశ్వసించి రనినే నెఱుగఁ గలిగితిని.

" నేనుజూచిన విషయములను బట్టియు, వినిన సంగతులను బట్టియు మనము రాజ్య కార్య నిర్వహణమున జనులయెడ నెక్కు డు సానుభూతి గనుపలుకఁ గడంగినచో భారత వర్షము నేలుట మనకింకను మిక్కిలి సులభముగా గలదని తీర్మానించి తీరవల సినవాఁడనై యున్నాను.

""అట్టి సానుభూతికి నెల్లప్పుడును జనులు గొల్లలుగ నిజమగుఁ గృతజ్ఞతఁ జూవుదురని నేను నిశ్చయముగఁ జెప్పఁ గలను... పూర్వ దేశములకు సహజమగు నిర్మలా కాశము ఛత్రముగఁ దరలివచ్చి నానావర్ణ వస్త్రములు ధరించిన సర్వ జాతి జనులును బొంబాయిలో కరాస్ఫాలనాది శుభచిహ్న ములతో నాకొసంగిన స్వాగతమును చిత్రించుటకు నాకు శక్తి యుండిన బాగుండు నేయుని మనసు ఉవ్విళ్లూరు చున్నది. కాని