పుట:Delhi-Darbaru.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సానుభూతి వాక్యములు.

85


కలలయందుంగూడ దల పెట్టుచుండెనని వక్కాణించు చుండెను. నేనును నాభార్యయు నట్టి యూహలతోడనె యుంటిమి. మీరును మీసహకారులును ఈమా తలపోతల నింత జయప్రదముగఁ దీర్చినందులకు మేము మీ కెంతయుఁ గృతజ్ఞులము. తండ్రిగారి వలెనే మేమును నడచుకొనుటలో వారిచేఁ బ్రారంభిపఁ బడిన యాచారమును నెఱవేర్చిన 'వారమగు చున్నారము. ఆయా చారము దరతరముగఁ బూ ర్తి సేయఁ బడుచు నేయుండుఁ గాక యని మాయాశయము. నేనును రాకొమరితెయుఁ బూనుకొనిన యీభ్రమణముల నొక్క లోపముండక మానదు. ప్రతివస్తు వును జూచుటకును, గౌరవ మొనర్చు ప్రతివ్యక్తి కిని మాకృతజ్ఞత సూచించుటకును మాకు కాలముచాలదు. ఏరి సంస్మరణ మన కెల్ల రకును బ్రేమావహమో అట్టి నా మొదటి మహా రాజి యగు నాయవ్వనుండియు నా తండ్రినుండియు భరతవర్షము నెడను భారతీయుల యెడను బ్రేమ వంశపరంపరగ వచ్చి యున్నది. నాచిన్న తనమునుండి భరతవర్షమనిన దయ, భక్తి మర్యాద, ధైర్యము అను నీ సద్గుణములకుఁ బర్యాయ పదమని యెన్ను కొనుచున్నాఁడను. ముందు కొద్దిమాసముల లోపలన నాయనుభనములవలన నీప్రథమభావములు బలపడఁ గలవని నమ్ముచున్నాను. భారతీయుల యెడ సానుభూతియుఁ బ్రేమయు గల వారమగుటయే గాక వారి కొఱంతల యందును కామ్య ములయందును నెక్కుడు పరిచయముతో సంబంధము గలుగఁ