పుట:Contributing to Wikipedia brochure draft version 7.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
అరటి తొలి భాగం
  • సవరించు

చాలామంది వీక్షకులు దీనిని గమనించరు. వికీపీడియా వ్యాసానికి ముఖ్యమైనది. పైనవున్న సవరించు బటన్ నొక్కి వ్యాస మొత్తాన్ని లేక విభాగం శీర్షిక పక్కన వరుసలో కనబడే సవరించు బటన్ నొక్కి ఆ ‌విభాగాన్ని సవరించండి.


  • చరిత్రను చూడండి

వికీపీడియా వ్యాస చరిత్రలో సృష్టించినప్పటినుండి జరిగిన ప్రతిమార్పు వుంటుంది. ఎవరు, ఎప్పడు దేనిని మార్చారు, ఏ రెండు రూపాలనైనా పక్కపక్కనే పోల్చిచూడవచ్చు.

  • ఖాతాను తెరువు

మీరింకా చేయకపోతే , ఖాతాను తెరవండి. ఖాతాతో, మీరు చేసే కృషిని పురోగతిని గమనించడం సులభం, మీ కృషికి తోడ్పాటుగా సహ సభ్యులు ప్రత్యుత్తరమిచ్చినప్పుడు సూచనలు అందుతాయి

  • వెతుకు

పేరుతో లేక పదం గల పేజీలను వెతకండి. ఇక్కడ దగ్గరిదారులు చేర్చడం ద్వారా ఈ పత్రంలో సూచించే కావలసిన పేజీలకు చేరుకోవచ్చు. ఉపయోగపడే ఒక| దగ్గరి దారి WP:HELP

    • తెలుగులో వెతుకుట

దీనికొరకై ముందు భాషా అమరికలపై నొక్కి కీ బోర్డు నమూనాను లిప్యంతరీకరణకు (బొమ్మ కొరకు పే. 12 చూడండి) మార్చుకోండి. ఆ తరువాత ఆంగ్ల అక్షరాలు టైపు చేస్తే తెలుగులోకి మారతాయి (ఉదా te టైపు చేస్తే తె గా కనబడుతుంది). మరియు టైపు చేసిన అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యాసాలు జారుడు పెట్టెలో కనబడతాయి. వాటిలో సులభంగా ఎంపికచేసుకోవచ్చు. ఇంకా కనబడే నీలి లింకులు, వ్యాసం అడుగున వుంటే వర్గాల లింకులు సహాయంతో వికీపీడియాలో మీకు కావలసిన పేజీకి త్వరితంగా చేరుకోవచ్చు. మరింత సహాయం కొరకు | దగ్గరి దారి WP:TH