పుట:Contributing to Wikipedia brochure draft version 7.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వికీపీడియా పేజీలలో విహరించడం

అరటి వ్యాసం తొలి భాగం

మీ పని ప్రారంభించడానికి వికీపీడియా వాడుకరి అంతర్వర్తి (User Interface) చూడండి. వికీపీడియా పేజీలలో విహరించడానికి ఇది సహాయంగా వుంటుంది.


చర్చ ప్రతి పేజీకి చర్చా పేజీ వుంటుంది. దీనిలో సభ్యులు వ్యాఖ్యలు, సలహాలు, ప్రతిపాదించే మార్పుల చర్చలు చేయవచ్చు, సహాయం కొరకు అభ్యర్ధించవచ్చు. సత్వర సహాయంకొరకు మీ వ్యాఖ్యతో పాటు {{సహాయం కావాలి}} అని చేర్చాలి లేక సంబంధిత సభ్యుల పేర్లకు వికీలింకులివ్వాలి.



  • రచ్చబండ

ఇక్కడ వికీపీడియా వ్యవస్థలో వార్తలు, విధానాల చర్చల లాంటివి తెలుసుకుంటారు

  • సహాయసూచిక

వ్యాసరచనకు ఉపకరించే మార్గదర్శక వ్యాసాలు వాటికి లింకులు ఉంటాయి. వ్యాస పేజీలలాగానే ఇవి కూడా వికీపీడియా సభ్యుల చేతనే రాయబడినవి.

  • సముదాయ పందిరి

సభ్యులందరూ కలిసే పనిచేసే ప్రాజెక్టులు, సహాయం కోరుతున్న అంశాలు, సమావేశాల వివరాలు ఉంటాయి.

  • సంప్రదింపు పేజీ

ఇక్కడ వికీ సంస్థతో సంప్రదింపులు చేయడానికి అవసరమైన అంశాల వివరణ ఉంటుంది.

  • పరికరాల పెట్టె

ఈ విభాగంలో పేజీ, దాని చరిత్రను గురించిన అదనపు సమాచారాన్ని పొందటానికి ఉపకరణాలుంటాయి.

  • దస్త్రం ఎక్కింపు

బొమ్మలు ఫైళ్లు చేర్చుటకు ఆదేశం


  • ముద్రించండి/ఎగుమతి చెయ్యండి

ఒక పుస్తకాన్ని సృష్టించండి లేక పి.డి.ఎఫ్ క్రింద దిగుమతి చేసుకోండి


  • భాషలు

ప్రదర్శితమైన పేజీకి 280 పైగా ఇతర భాషలలో సరిపోలిన పేజీ లింకులు

  • భాషల అమరిక

ఈ అమరిక ద్వారా వికీపీడియాలో మెనూలకు, సందేశాలకు వాడే భాషను, టైపు చేయుటకు కీ బోర్డు నమూనాను ఎంపికచేయవచ్చు