పుట:Contributing to Wikipedia brochure draft version 7.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వికీపీడియా అంటే ఏమిటి?

సహకార విధానంలో పనిచేసే ప్రాజెక్టుల చరిత్రలో వికీపీడియా ప్రధమస్థానంలో ఉంది. వందలాది భాషలలో లక్షల కొలది వ్యాసాలతో గల వికీపీడియాను కోట్లమంది ప్రతిరోజు చదువుతుంటారు.

వికీపీడియాలో ఇప్పటికే పలువ్యాసాలు ఉన్నాయి. అయినప్పటికీ ముఖ్యమైన విషయాలు వికీపీడియాలో అంతంత మాత్రంగానే వున్నాయి లేక అసలు లేనే లేవు. వికీపీడియాలో విషయాన్ని తాజాగా వుంచడానికి, ప్రస్తుతం మొలకలుగా ఉన్న వ్యాసాలను విస్తరించడానికి, కొత్త వ్యాసాలను సృష్టించడానికి మీలాంటి వారిపై ఆధారపడుతుంది. మీ వికీ కృషి వందలూ, వేలూ, ఒక్కోసారి లక్షలాది ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంచడానికి తోడ్పడుతుంది.

మీరు వికీపీడియాలో మార్పు చేయడం ప్రారంభించినప్పటినుండి, మీరు లక్షల్లోవున్న ---వికీపీడియా సభ్యుల సముదాయంలో-- ప్రవేశిస్తున్నారన్నమాట. వీరందరూ తమ జ్ఞానాన్ని స్వేచ్ఛగా, ఉచితంగా వికీపీడియాలో పంచుకుంటున్నారు.


వికీపీడియాలో మీ కృషి అంతా ఉచిత విషయాలవుతాయి. ఇవి అందరికీ అందుబాటులోకి వస్తాయి. వీటిని సహ సభ్యులు దిద్దుబాట్లు చేయవచ్చు. వీటిని స్వేచ్ఛా ఉచిత లైసెన్సుల ఆధారంగా పునరుపయోగించడానికి వీలు ఉంటుంది

WP:STATS

వికీపీడియా గురించి తాజా గణాంకాలు చూడాలనుకుంటున్నారా? బొమ్మలో చూపినట్ల వెతుకుపెట్టెలో WP:STATS టైపు చేసి ఎంటర్ కీ నొక్కండి . WP:STATS అనబడే పాఠ్యం వికీపీడియాలో దగ్గరి దారి అనమాట . ఇలాంటి దగ్గరిదారులను వెతుకుపెట్టెలో వాడడం ద్వారా కావలసిన పేజీలను సునాయాసంగా చేరుకోవచ్చు. ఈ కరపత్రంలో దగ్గరి దారులను | దగ్గరిదారి WP:STATS లాగా చూపిస్తాము.