పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

ప్రారంభించి నిరపరాధులగు ఉద్యమనాయకులపై ఏవో నెపములనిడి వారిపై అభియోగములను తెచ్చినది. మహామేధావి, జ్ఞానియైన అరవిందఘోషు జాతీయోద్యమనాయకుఁడు. మఱికొందఱు యువకులతో కూడ నిర్బంధ విధానమునకు లోబడవలసిన వారైరి. నిందితుల కేసును దొరతనపువారు పూర్ణముగ బలపరచిరి. నిందితపక్షమున వాదించుటకు మన చిత్తరంజనుఁడు పూనికొని తన దేశస్థులును, మహావిద్వాంసులు నైన అరవిందఘోషు వంటివారి చిక్కును వదలించుటకై కంకణము కట్టికొని ఈవ్యాజ్యమున తనకు ద్రవ్యలాభమే లేకపోయినను, డిఫెన్సు వాదమునకు కావలసిన సాక్ష్యమును సిద్ధము చేయుటకే ఆఱు నెలలు పట్టినది. వ్యాజ్యమా ఏడాది సాగినది. ఈలోపుగా ఇంటి సామాన్యఖర్చులకు కూడ చేత పైకము లేక పోయినది. పట్టుపట్టి నేర్పుతో వాదించి అరవిందఘోషుని నిర్దోషి యనిపించెను. ఇందువలననే ఈతఁడు కలకత్తా న్యాయవాదులలో నగ్రగణ్యుఁ డాయెను. న్యాయమూర్తులు తోటి న్యాయవాదులు ఎల్లవారును చిత్తరంజనుని బుద్ధి కౌశలము నెఱింగిరి. పిదప డక్కా రాజద్రోహనేరమున నిందితులతట్టు వాదించి వారిని నిర్దోషు లనిపించి విడుదల గావిం