పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

విస్తారమైన తెలివి ఎన్నటికిని దాగియుండనేరదు. దానివేండ్రమును అదిసమయము వచ్చినప్పుడు చూపియేతీరును.

1907, 1908 వ సంవత్సరములలో బంగాళమున నూతన ప్రబోధ మొకటి పొడమెను. బంగాళీలు దీర్ఘనిద్రనుండి లేచిరి. ఎటుజూచినను వారికి ఐరోపియను వస్తువంటె అసహ్యమైనది. కర్ణన్ ప్రభువు ఆకాలపు ఇండియా వైసిరాయిగారు. వారి ప్రభుత్వ విధానమంతయు బంగాళీలకు నచ్చ లేదు. స్వరాజ్యోద్యమము, జాతీయ విద్యాప్రారంభము, విదేశవస్తు బహిష్కారము ఈమూటికిని బీజము లాకాలములోనే బంగాళాయందు అంకురించినవి. మనదేశములో ఏదిపుట్టినను మొట్టమొదట బంగాళములో పుట్టవలయును. ఆర్యావర్తముసుమా! అది.ఋషులు వేదాలు పాడినది అక్కడ. జ్ఞానులు ఉపనిషత్తులు చెప్పినది అక్కడ. శాస్త్రులు శాస్త్రాలు రచించినది అక్కడ. కవులు కావ్యాలు వ్రాసినది అక్కడ. సరస్వతీమందిరాలు ఉన్నవి అక్కడ. విద్యాపీఠాలు వెలసినవి అక్కడ

పై యుద్యమములు మూఁడును ప్రారంభింపఁగా నే నిరంకుశాధికారవర్గము నిర్బంధ విధానములకు