పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

రంజనుఁడు ధైర్యముచేసి బారిస్టరుపరీక్షకు చదువుటకై యత్నించెను. ఈదినములలో చిత్తరంజనునకు చేత కాసు లేక కొన్నాళ్లు ఉత్తనీళ్లుద్రాగి కాలక్షేపము చేయవలసినవాఁ డయ్యెను.

న్యాయవాదవృత్తి.

ఆంగ్లేయభాషలో సాహిత్యమును విశేషముగ గడించినవాఁడు కావున ఉపాధ్యాయవృత్తిని స్వీకరించవలయునని మాత్రము అభిలాష చిత్తరంజనునికి మెండు. అయితే, ఈవృత్తివలన విశేషధన మార్జించుటకు వలను లేదనియు, ధనమార్జించి ఎట్లైనను తండ్రి ఋణవిమోచనము గావింపవలయు నను ఉద్దేశము ఎక్కువగా నుండుటచే విధిలేక న్యాయవాదవృత్తిని 1893-వ సంవత్సరమున కలకత్తా హైకోర్టులో స్వీకరించెను. తండ్రి అప్పులనంతయు తానొప్పుకొని వానినంతయు చెప్పిన గడువు ప్రకారము ఇయ్య లేకపోవుటచే తానును ఇన్‌సాల్వెన్‌సీ పత్రమునకై పిటీషన్ కోర్టులో పెట్టవలసిన వాఁడయ్యెను. ఎట్టివానికిని ఏవృత్తియందును మొట్టమొదట విశేషధనము గడించగల అదృష్టము పట్టనేరదు. చిత్తరంజనుఁడు తన అపారమగు ధీశక్తిని చూపుటకు కాలము ఇంకను తటస్థించ లేదు.