పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

61

అంతట దేశబంధువుని 'స్వరాజ్య'వార్త మహా --- యసహాయోద్యము వలెనే దేశమందంతటను వ్యాపించెను ప్రజలెల్లరును శాసనసభలకు స్వరాజ్యకక్షవారినే పంపవలయునని తీర్మానించుకొనిరి. ఈతీర్మానమునే ప్రజాభిప్రాయములను దెలుపుచు డిల్లీలోఁ జేయఁబడిన అవసరకాంగ్రెసులోఁ గూడ మౌలానామహమ్మదాలీ నాయకత్వమును: మౌలానా అబ్దూల్ కలాంఆజూడ్ గారి యాధిపత్యమునను శాసనసభలకుఁ బోవువారిని కాంగ్రెస్ అడ్డుఁపరుప గూడదనియు, కాంగ్రెసులో నైకమత్యమే ప్రధాన మనియు దృఢపరచినది. కాంగ్రెసుతీర్మానమునే ప్రజలొప్పుకొనిరి. ఇది స్వరాజ్యకక్షవారికిఁ గలిగిన జయమే సూచించుచున్నది. అఖిలభారత శాసన సభాసభ్యులలో నొకస్వరాజ్యకక్షవారుమాత్రమే 55 సభ్యులున్నారనుట మనమెల్లరును గర్వపడవలసిన విషయమే.

ఇతరరాష్ట్రములందేగాక వంగరాష్ట్రమునకూడ స్వరాజ్యకక్షవా రనేకులు శాసనసభ్యులైనమీదట గవర్నరు లిటన్ ప్రభువు శ్రీ దాసుగారి నాహ్వానించి మంత్రివర్గమును నిర్మించమని కోరెను. ఆమీద తన కక్షవారిని సమా వేశపఱచి వారుకోరిన షరత్తుల కొప్పుకొన్నచో మంత్రి పదవుల స్వీకరింతురని చెప్పి