పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

దేశములోని మహనీయు లనేకులు చేరిరి. బొంబాయినగరములో వీ. జే. పటేలుగారును, పూనాలో కేల్కారు, అలహాబాదులో పండితమోతీలాలు నెహ్రూగారును, తమిళనాడున శ్రీమాన్ ఏ. రంగస్వామయ్యంగారు, ఎన్. సత్యమూర్తిగారు, ఆంధ్ర దేశనాయకులలో ప్రసిద్ధిఁగాంచిన బారిస్టర్ :ఉన్నవ లక్ష్మీనారాయణగారు, వి. యల్. శాస్త్రిగారు, బారిస్టర్ : కందుల వీరరాఘవస్వామిగారు మనస్ఫూర్తిగ నీయుద్యమమును కొనసాగించవలయు నని దృఢముగఁ దీర్మానించుకొనిరి.

మొదటిరెండు నెలలు వీరు చాలప్రోత్సాహముతోఁ బనిచేయుటనుఁ జూచి కాంగ్రెసులో భిన్న భావము లుండఁగూడదనియు నటులుండిన దేశమునకు క్షేమములేదనియు నొకవిధమైనసంధి నొనఁ గూర్చవలయునని కొందఱు నాయకు లభిప్రాయ పడి మొట్టమొదట ఫిబ్రవరినెలలో కాంగ్రెసు కార్య నిర్వాహక సభయందు రాజీతీర్మానమును దెచ్చిరి. దేశబంధు తనసహజభావముతో సంధికొప్పుకొనెను. కాని, రాజగోపాలాచార్యులవారి మొండి పట్టుదల వలన నీతీర్మానము కాంగ్రెసు అంగీకరింపలేదు. దేశబంధువు రాజీ కుదురవలెనని యపేక్షించిన వారిలో నొక్కఁడుకాఁడు. కావున రాజీకై యతఁడు వేచి