పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

ముననే కాపాడవలయు ననుటము పొరబాటు. వారు భారతదేశమును నీతిబలముచే సాధించిరి. బాహుబలమున సాధించినామనుట బొల్లు. ఈమాటలను వినుట భారతీయునకు మిక్కిలి వ్యథగా నుండును. ఇట్లు వచించుట ఆంగ్లేయునకు కడునీచ మైయుండును.” ఈమాట లాసభ్యులమనసున కెక్కి మెక్లీనును తనపొరపాటుకై పార్లమెంటు సభ్యత్వమునకు నిర్బంధముగా రాజీనామా నొసంగునట్లు చేసినవి.

ఈయాందోళనము నంతయు ఇంగ్లాండునందలి నిరంకుశాధికార దొరతనపువర్గము కనిపెట్టుచుండి సివిల్ సర్వీసు పోటీ పరీక్షలలో జయముగాంచుటకు వలయునన్ని గుణములకంటె ఎంతో హెచ్చుగా వచ్చియుండియు, చిత్తరంజనునిపేరు విజయమునొందిన వారిపేర్ల పట్టీలోనుండి తొలగించిరి. ఈయపజయము చిత్తరంజనుని కుటుంబమున విపరీత అశాంతిని గలుగఁ జేసినది. కుటుంబస్థితి మిక్కిలి దుర్దశలో నుండెను. పరీక్షలో జయము నొందియుండినచో ఇండియాదొరతనమున నేదో గొప్పయుద్యోగము లభించి కుటుంబమునకు జీవనాధార మేర్పడియుండునని కుటుంబమువారు తలంచిరి. అయితే విధిని ఎవరు తప్పింపఁగలరు? వెంటనే చిత్త