పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57

కాని, యీతఁడు జరుగఁబోవు గయాకాంగ్రెసు తీర్మానమునకు వేచియుండెను.

గయాకాంగ్రెసు.

జనులెల్లరు దేశబంధువుచేసిన త్యాగమునకును దేశసేవకును మెచ్చి యీతని నేకగ్రీవముగ దేశీయ మహాజనసభ కధ్యక్షుఁడుగ నెన్నుకొనిరి. చిత్తరంజనుఁడు కాంగ్రెసులోఁ దనయభిప్రాయములన్నియు వెల్లడిపరచెను. అచ్చటి మహాసదులెల్ల రు నాలోచించిరి; కాని దేశబంధుని యభిప్రాయమును రాజగోపాలాచార్యులు ప్రతిఘటించి యది మహాత్ముని యభిప్రాయమునకు ప్రత్యక్షవిరోధమని చెప్పినందువలనను కాంగ్రెసు అధికసంఖ్యాకులు రాజగోపాలాచారిగారి పద్ధతి ననలంబించినందునను దాసుగారి శాసనసభా ప్రవేశ భావము నెగ్గకపోయెను. చిత్తరంజనుఁడు అపజయములకు వెఱచువాఁడు కాడు. అపజయ మాతఁ డెప్పుడు చెందునో అప్పుడే యాతని యద్భుతశక్తి ప్రజ్వరిల్లును. కొంచెమైనను వెనుదీయక మనమున కొంతయైనను కుందక దేశబంధువు తనకార్యమును బూనెను. కాంగ్రెసు విధానమున కేలాటి సంబంధమును లేక తనకక్షవారి నందఱ నొక్కటిగఁ జేర్చి స్వరాజ్యకక్ష యని తత్క్షణమే యేర్పాటుఁ జేసెను. ఈకక్షలో భారత