పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

వనియు, నాశాసనసభలలో కాంగ్రెసుపక్షపువారు ప్రవేశించి వానిని తుదముట్టించినయెడల, దొరతనమువారి ప్రజాపరిపాలనమను నామముననుండు నిరంకుశాధికార మడుగారి పోవుననియు విదేశీయులకు సైతము ఇండియా దొరతనమువారు చేయు కార్యములయందు ఇండియా ప్రజలకు సుముఖత్వము లేదనియుఁ జక్కగ నెఱుంగుదురు. ఈవిధమున భారతప్రజల కొకవిధమైన ప్రోత్సాహము కలిగినచో మరల నసహాయోద్యమ మభివృద్ధిఁ జెందఁగలుగును” అని యభిప్రాయఁబడిరి. శ్రీమాన్ సి. రాజగోపాలాచార్యులు, ఎస్. కస్తూరి రంగయ్యంగారు, డాక్టర్ : ఎం. ఏ. అన్సారీగారలు గాంధిమహాత్ముని యభిప్రాయముల నే మనము కొనసాగించుకొనవలయుననియు, బర్డోలి నిర్మాణకార్యక్రమము నవలంబింపవలయు ననియు తీర్మానమునకు వచ్చిరి. దేశబంధు చిత్తరంజనదాసు పరిస్థితు లన్నియుఁ జక్కఁగ బరిశీలించి కాలమునకుఁ దగినమార్పులు లేకున్నచో నేదేశమును జేమపడదనియు నేయుద్యమమును జయమంద లేదనియుఁ దెలిసికొనెను. మహాత్ముఁడు చెఱసాలనుండి విడుదలఁ జేయఁబడిన నాతఁడును తనవిధానము మార్చునని దృఢముగ నమ్మెను.