పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55

నాయకు లనేకులు కారాగృహబంధితులైరి. 1922వ సం॥ డిసంబరు మాసమున గయలో కాంగ్రెసుమహాసభ జరిగెను. ఈసభ నాటికి కొన్ని నెలలకుమునుపే మోతీలాల్ నెహ్రూగారు, చిత్తరంజనదాసు మొదలగు ఉత్తరదేశనాయకులును ఆంధ్రనాయకులనేకులును విడుదలలను బొందిరి.

శ్రీయుత దేశబంధు చిత్తరంజనదాసు చెఱసాల నుండి విడువఁబడినపుడు కాంగ్రెసు పరిస్థితులు మహాత్ముఁడు . కాంగ్రెసునకు నాయకుడుగ నుండినట్టి స్థితితో లేవు. ఈపరిస్థితులు కాంగ్రెసులో మారిన వే కాక దేశములోకూడ మారినవి. దేశములో నసహాయోద్యమము నందలి యనురాగము ప్రజలలో క్షీణించెను. ప్రజలు పన్నులుచెల్లింపక దౌర్జన్యరాహిత్యముగ సర్కారుతోఁ బోరాడఁగలరా యను విషయమును దెలిసికొనుటకు దేశమం దంతటను కాంగ్రెసునాయకులు పర్యటనము సలిపిరి. ఈసంఘములో నార్గుఱు నాయకులును ప్రజలలో నుద్రేకము క్షీణించినదని యభిప్రాయపడిరి గాని యీయుద్రేకము నెట్లుద్ధరించుట? యనుమార్గములో మాత్రము భిన్నభావములను తెలిపిరి. హకీం అజ్మాల్ ఖాను, పండిత మోతీలాల్ నెహ్రూ, వి. జే. పటేల్ గారలు “శాసనసభలు చాల యకృత్యములఁ జేయుచున్న