పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

చుండెను. ఆయుద్యమమున చిత్తరంజనుఁడు పాల్గొని అనేక రాజకీయోపన్యాసముల గావించి యశస్సు పొందెను. ఇట్లుండ ఒకానొక పార్ల మెంటు మెంబరు జోన్ ట్సు మే క్లీ ననువాఁడు భారతమహమ్మదీయులను బానిసలనియు, హిందువులు నిబంధనలపద్ధతి ననుసరించు బానిసలనియు దూషించగా చిత్తరంజనుఁడు ఆదూషణకు సహించక ఒకగొప్ప సభాసమావేశము గావించి ఆసభలో మెక్లీను అవసరపడి చెప్పిన మాటయందు తెలివి తక్కువను గన్పించినదే కాని మరియే అన్యమును కానరాదని ఒక తీర్మానమును చేసెను. ఇంగ్లాండునందు పత్రికలు ఈతీర్మానమునకై గొప్ప ఆందోళనము జేసెను. ఈయాందోళనాఫలితముగ వేరొకసభ లిబరల్ కక్షవారు గావించి దానికి గ్లాడ్ట్సను మహామంత్రిగారిని అధ్యక్షులుగా జేసి ఆసభలో చిత్తరంజనుని హిందూదేశపు స్థితిగతులను గుఱించి యుపన్యాసమును గావింపమనిరి. ఆ సమయమున తనవాగ్ధోరణిని, యుక్తియుక్తమును, చాతుర్యమును, దేశభక్తియుతమును నై నదానిని ఆసభవారికి మిక్కిలి ధైర్యముతో దెలుపుచు “పార్ల మెంటుసభలో సభ్యులు పలుమారు భారతదేశమును ఆంగ్లేయులు తాము ఆయుధబలిమిచే జయించిరనుటయు, దానిని కృపాణప్రయోగ .