పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

లజపతిరాయని లాహోరులో నిర్బంధించిరి. ఈమహామహుని నెఱుంగని భారతీయుఁడు లేఁడు. ఈపరోపకారి కాంగ్రెసునకు ఆత్మవంటివాఁడు. ఐరోపాసంగ్రామకాలమందు భారతప్రభుత్వమువారు వీరిని అమెరికానుండి భారతదేశమునకు రానీయక అడ్డు పెట్టిరి. తత్పూర్వము భారతదేశమున ప్రథమమున నీదేశోపకారిని విచారణలేకయే ప్రవాసమునకు పంపిరి. ఐరోపాయుద్ధానంతర మీతఁడు భారతదేశమున కేతెంచెను. అప్పటినుండి ఈయన కాంగ్రెసుపట్ల పూర్వమువలెనే నిరంతరకృషి యొనర్చుచునే యున్నాఁడు. లజపతిరాయిని కలకత్తా అవసరకాంగ్రెసునకు అధ్యక్షునిగా ప్రజలొనర్చిరి. ఈసభలో నే అసహాయోద్యమము నాచరణలో నుంచఁబడవలయునని మహాత్మాగాంధి తీర్మానమును సభవారి యామోదమునకు దెచ్చెను. లజపతిరాయి అధ్యక్షతక్రింద జరుపఁబడిన ఈఅవసర కాంగ్రెసుసభలో నధికసంఖ్యాకు లీతీర్మానము నంగీకరించిరి. ఇట్టి లజపతిరాయివంటిమహానుభావుని దొరతనము నిర్బంధింపగానే చిత్తరంజనుఁ డతిరోషయుతుఁడయ్యెను. నిరంకుశాధికార వర్గముయొక్క చర్యలను మితిలేక ఖండించెను. కాంగ్రెసులో తీర్మానమైన మేరకు కలకత్తావిద్యార్థులను తమబళ్ళను వీడమని మహోప