పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

ఆతీర్మానము సభలో చర్చ కేరాకుండునట్లు యుక్తి యుక్తముగ మాటలాడెను.

1918 వ సంవత్సరమున కలకత్తాలో రాజకీయ కలవర మొకటి ప్రారంభముకాగా నందు చిత్తరంజనుడు ప్రవేశించి గొప్పన్యాయాధిపతివలే వర్తించి కలవరమును అంతమొందించి శాంతినినెలకొల్పను. ఇప్పుడే పాంచాల దేశమున సర్ మైకల్ ఓడ్వయరు యొక్క దుష్పరిపాలనక్రింద పాంచాలదేశమున ఘోరమరణములు, ఘోరహత్యలు, కొన్ని ప్రదేశములలో సైనిక పరిపాలనము, ఆపరిపాలనమునం దధికారులు గావించిన ప్రజపీడనము ఇవన్నియు భారతదేశమునందు ప్రజాహృదయమును కల్లోలపరుపసాగెను. అప్పట్లో చిత్తరంజనులు పాంచాలమునకు స్వయముగావెళ్ళి నిజపరిస్థితుల నరసివచ్చుటకు బయలు దేరగా దొరతనమువారు వీరిని పాంచాలమున కడుగు బెట్టగూడదని హెచ్చరిక జేసిరి. ఈ పాంచాలదురంతముల నాధారముగఁ జేసికొని మహాత్మగాంధిగారు సత్యాగ్రహవిధానమును భారతదేశమున ప్రారంభించెను. ఇది దేశమంతయు నల్లుకొని దేశములో నుండు జాతీయనాయకులందఱును ఈవిధానమును అవలంబించుటకు యత్నింపసాగిరి. చిత్తరంజనుఁడు సైతము ఆయుద్యమము పవిత్రవంతమనియు నిరం