పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ఱచెను. ఇట్లే ఆదినములలో పలువురు నిర్బంధింపఁ బడిరి. వారివిడుదలకుగాను చేసినసభలలో చిత్తరంజనుఁడు సభ్యులను తనయుపన్యాసమునందు మగ్నులనుగావించెను. చిత్తరంజనుఁడు ఏసభయందు ఉపన్యాసము చేయునాయని ప్రజలు ఆతురపడుచుండిరి. ఊఱక ఉపన్యాసమేగాక చెఱసాలల కంపఁబడిన వారి కుటుంబములు అన్నము లేక మలమల మాడు చుండ వారి కుటుంబములను తాను పోషించు నిమిత్తము కంకణము కట్టుకొని ఈవిషయములో నెలకు 4 లేక 5 వేల రూపాయలను వెచ్చింపసాగెను. ఇంతటికరుణాసముద్రుఁడు ప్రపంచముననే యుండుట అరుదని తన ప్రవర్తనవలన లోకులకు విశదీకరించెను. దేశాభిమానమును చూపువారు కొందఱు సభా వేదికలపై నిలిచి తమవాగ్ధోరణినిగన్పింతురు. కొందఱు కన్నీరు మున్నీరుగ కార్తురు. ద్రవ్యమును వెచ్చింపవలసి వచ్చినప్పుడు మాత్రము వెనుదీయుదురు. మనచిత్తరంజనుని దేశాభిమానము అట్టిదికానేరదు. రాజకీయనేరములకై చెఱసాలయం దుంపఁ బడినవంగీయు లనేకులు 1919 సం॥ డిసంబరు నెలలో విడుదలచేయఁబడిరి. వీరందఱును చిత్తరంజనుని ఇంట్లో ఒక సందర్భమున సమావేశమై తమకుటుంబముపట్ల చిత్తరంజనుఁడు చూపిన అపారమగుసాయ