పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

చేయును; గ్రామపరిశ్రమాభివృద్ధికి పూచీగానుండును. 4. గ్రామముయొక్క ఆరోగ్యపరిస్థితులకు గ్రామపంచాయతీదార్లపై అధికారమును వినియోగించును. జిల్లాసభలో ఆరోగ్యశాఖకుజబాబుదారిగ ప్రవర్తించును. 5. జిల్లాలో నుత్పత్తికాఁగలవస్తువుల కాధారభూతములగు పరిశ్రామికాభివృద్ధికి ఈ జిల్లాసభలు తోడ్పడగలవు. 6. ఈజిల్లాసభలు చౌకీదార్లను, గ్రామోద్యోగుల నేర్పరచు అధికారము గలిగియుండును. 7. జిల్లాపోలీస పై సర్వాధికారము ఈజిల్లాసభ కుండును. 8. ప్రతిజిల్లాసభయును తమ సభ్యులలోనుండి అధ్యక్షుని ఒక్కరుని ఎన్నుకొనుట కధికారముగలిగియుండును. అనేక విషయములను చర్చించుటకు ప్రత్యేకసభలను గూర్చుట కధికారముగలిగియుండును. 9 ప్రతిజిల్లాకును ప్రత్యేక (బ్యాంకి) ధనాగారముండగలదు. ఈ బ్యాంకీలకు ప్రత్యేకశాఖా బ్యాంకీలు గ్రామములలో నుండును. 10. ఈ బ్యాంకీలకు వలయుధనమును ఆజిల్లాలో పన్నులను వేసి వసూలు పఱచుటకు ఆజిల్లాసభ కధికారముండును 11. ప్రస్తుతపు లోకల్‌ బోర్డులు జిల్లాబోర్డులు రూపుమాసిపోవలయును. 12. గ్రామసభలను, జిల్లాసభలను నడపుటకు ప్రత్యేక చట్టములను నిర్మింపవలయును. హిందూ