పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

విషయమును, వ్యవసాయదార్లకు రాత్రిబళ్లను, గ్రామ పరిశ్రమలను, వ్యవసాయవిద్యను, కుటుంబ ఆర్థికాభివృద్ధియంతయు ఈపంచాయతీదార్ల చే నుండగలదనియు, కొన్ని పెద్దగ్రామములలో ప్ర త్యేక పంచాయతీల నేర్పఱుపవచ్చుననియు, చిన్న చిన్న గ్రామములను కొన్నింటిని జేర్చి యీగ్రామముల యొక్క పంచాయతీల నేర్పఱుపవచ్చుననియు, ప్రతిగ్రామమునందును కాటకసమయమున గ్రామములోని బీదవాండ్ర సంరక్షణార్థము ధాన్యపు సేకరము గావింపఁబడవలయుననియు, ఈధర్మకూట్లకు యేటా ఫలితకాలమున గ్రామస్థులందఱు యధోచితముగ శక్తి ననుసరించి ధాన్యమును ధర్మముగా నొసగుచుండవలయు ననియు, ఈధాన్యపు కూట్లు గ్రామపంచాయతీదార్ల పాలనచే రక్షింపఁబడవలయుననియు, కాటకముసంభవించినపుడు పంచాయతీదార్లు ధర్మధాన్యకూట్లనుండి ఆగ్రామపు బీదజనులను అల్లాడ నీయక పోషింపవచ్చుననియు నిట్టి పద్ధతులతో గూడిన పంచాయతీపరిపాలన యేర్పాట్లనుకొన్నింటిని మిక్కిలి నేర్పుతో నాసభలో తనయుపన్యాసము నందు సూచించెను. గ్రామములోని స్వల్పతగవులను ఈపంచాయతీసభ వారు తీర్చిన మేరకు జనులు నడుచు కొనుచుండవలయుననియు, పెద్దతగవులను జిల్లా