పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

వాదులలో నగ్రగణ్యుఁడును నైన చిత్తరంజనదాసుగారి పూర్వులుండిన స్థానము. చిత్తరంజనుని ప్రపితామహుఁడు బాబురత్న కృష్ణదాసు అతిధార్మికుఁడు. ఈరత్నకృష్ణ దాసు కుమారులలో జ్యేష్ఠుఁడు జగద్బంధుదాసుఁడు రాజషాహిలో గవర్నమెంటు ప్లీడరై యుండి మిక్కిలి ఖ్యాతిగడించెను. తాను గడించిన ద్రవ్యమునంతయు బీదలపాలు జేయుచు అడిగినవారికి లేదనక ఉపకరించుచు దానకర్ణుఁడను కీర్తిపొందెను ఈజగద్బంధుదాసుఁడు. అంతేగాక, కవులకు విద్వాంసులకు సైత మీతఁడు కల్పవృక్షమై యుండెను. ఈతని సద్గుణములె మన చిత్తరంజనుని యందు నెలకొనినవి. చిత్తరంజనునితండ్రి తండ్రి బాబు భువనమోహనదాసు. ఈతఁడును కలకత్తా హైకోర్టునందు అటర్నీ వృత్తిని స్వీకరించి న్యాయవాదియై ఖ్యాతిగాంచెను.

భువన మోహనుఁడు వృత్తియందు న్యాయవాది యైనను దేశక్షేమమునకై హృదయపూర్వకముగ పాటుపడవలయునను సంపూర్ణో ద్దేశము కలవాఁడు. బ్రహ్మసమాజోద్యమాభివృద్ధికి తన యావత్తుశ క్తిని వినియోగించుచుండెను.

న్యాయవాద వృత్తియందు విస్తారధనము నీతఁడు గడించి బీదలగు తనచుట్టాలకై యాధనమును