పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

షముగ పట్టుబడినవి. ఇట్టి తనతల్లియం దాతని యనురాగము మిక్కిలిగాఢము. కాని, ఆమె గతించు కాలమున నామె చెంతనుండుభాగ్యమును మాత్రము చిత్తరంజనునకుదైవము విధింపలేదు. ఆమె చిత్తరంజనుని సాగరగీతములను తనరొమ్ముమీద నిడికొని తనభర్తతో పునర్భవయైనప్పుడు తానొక ఇల్లాలైనచో చిత్తరంజనునివంటి సుపుత్రుఁడు తనగర్భమునం దుదయించవలయుననియే తన అంత్యకోకగా నుడివి ప్రాణములు వీడెను.

తల్లిగతించిన యాఱునెలల కే చిత్తరంజనుని తండ్రియు పరలోకగతుఁడయ్యెను. తలిదండ్రులకు అపరక్రియలను శ్రద్ధతో జేసి యాదినములలో బీదసాదలకు మృష్టాన్నమిడెను. అప్పటియన్న దానమును వంగ దేశప్రాంతపు బీదసాదలు ఇప్పటికిని మరువక పొగడుచుండువారు. అప్పటినుండి గృహకృత్యములను కుటుంబమునకు పెద్దవాఁడగుటచే వహింప వలసినబాధ్యతను చిత్తరంజనుఁడు ఈసందర్భమున నెన్ని యో కష్టములు సంప్రాప్తించినను వానినన్నింటిని సంతోషముతో నెదిరించుచు ధైర్యముతో కుటుంబయాత్రను గడపసాగెను.

సోదరీసోదరులు

వసంతరంజనుఁడను నాతని తమ్మఁడు కలకత్తా