పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

గోరువారు ఆతని గ్రంథపఠనమును గావింపవలయును. ఆగ్రంథములను బోధపరచుకొనుటకు వంగదేశ పరిజ్ఞాన ముండితీరవలయును.

కుటుంబము.

మానవుని గుణములయొక్క అభివృద్ధి సామాన్యముగ నాతనికుటుంబముయొక్క పరిస్థితుల నాశ్రయించియుండును. చిత్తరంజనుఁడు సుగుణనిలయయైన తనతల్లిచేఁ బెంపఁబడి తనదేశమును నిజ జననియొక్క ప్రత్యగాత్మగా నెంచెను. తనతల్లిని తలఁచుకొనినప్పుడెల్లను చిత్తరంజనుని కన్నులనుండి జలజలనీరుబుకుచుండును. తన తల్లియొక్క దేశభక్తియే చిత్తరంజనున కాదర్శప్రాయమయ్యెను. ఆమె కడు ధీరవనిత; చాలనిదినములలో విధి బలీయమనుచు ఆమె తనయింటిపనులన్నియుదానే చేసికొనుచు భర్తకును బిడ్డలకును అన్న పానముల నమర్చుచు, లేమిడియందు కొన్ని సమయములలో నుపవాసములొనర్చి కాలయాపనజేసెను. ఆమె యోపికకును, ఉదారస్వభావమునకు, ఇంగితజ్ఞానమునకును పరోపకార పారీణత్వమునకును అనేక ఉదాహరణములున్నవి.

తలిదండ్రుల వియోగము.

మన చిత్తరంజనునకు ఆతని తల్లిగుణములు విశే