పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

ములు శోకరసముచే బోషింపఁబడి హృద్యములుగా నున్నవి. వైష్ణవ మతమును ప్రబలపరచుటకు చిత్తరంజనుఁడు బంగాళావాఙ్మయమున నూతనమార్గమును ద్రొక్కెను. 'నారాయణ' యను మాసపత్రికను నెలకొల్పి దానికి కొంతకాలము సంపాదకుఁడై యుండెను. విద్వాంసు లనేకులు ఈపత్రికకు వ్యాసములను వ్రాసిపంపుచుండిరి. వాజ్మయమున కాతని సేవనుమెచ్చి 1915 వ సంవత్సరమున వంగదేశ సారస్వతసభవారు బంకీపురమునందు జరిగిన సాంవత్సరీక విద్వత్సభకు చిత్తరంజనుని అధ్యక్షునిగాఁ జేసిరి. ఆతని యధ్యక్షకోపన్యాసము గాక ప్రత్యేకముగా వంగీయగీతములను గుఱించి రమ్యమైన వ్యాసరచన గావించి సభలో చదివెను. మరుసటి సంవత్సరము డక్కాలో జరిగిన విద్వత్సభకు ఆహ్వాన సంఘాధ్యక్షుఁడై యుండెను. 'నారాయణ' మాసపత్రికలో వంగదేశ పద్యకావ్యములను గూర్చి అనేక వ్యాసములను వ్రాసెను. అవి వైష్ణవ మతగ్రంథములలో నాతనికున్న అపారపాండిత్యమును వెల్లడించెను. వైష్ణవ కవీశ్వరులయొక్కయు భాగవతుల యొక్కయు గొప్ప ఆదర్శములే చిత్తరంజనునకు మార్గదర్శకము లయ్యెను. వాని దేశభ క్తి కివియే మూలాధారములు. ఆతనిని చక్కగ నెఱుంగ