పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

బ్రహ్మసమాజమువా రప్రియమును జూపిరి. మలంకా గీతములను రచించిన వెనుకనే 1897 లో చిత్తరంజనునకు వివాహ మయ్యెను. మలంకా గీతముల భావములకు బ్రహ్మసమాజాధ్యక్షుఁడై యుండిన పండిత శివనాథశాస్త్రి, అనేకులగు బ్రహ్మసామాజీకులు కినిసి వీరి వివాహమునకు గూడ జనరైరి. 'మలంకా' రచనకు పిదప 'మాల', 'అంతర్యామి', 'కిశోరకిశోరి', 'సాగర సంగీతము'లను నాల్గు గీతములను చిత్తరంజనుఁడు రచించెను. ఈతని కవనధోరణి ఈనాల్గు గీతములలో వంగదేశమున విస్తరించెను. కొన్ని గీతములు వంగీయుల కుగ్గుపాలతోఁ బోసిన వైష్ణవ సిద్ధాంతముల బయలుపరుచును. కొన్ని గీతములు మిక్కిలి శృంగారమును చిప్పిలఁ జేయును. కొన్ని శోకరసమును దెల్పుచు నత్యద్భుతముతో పరమేశ్వరుఁడెందున్నాఁడో యని వెదకు పరమ భాగవతోత్తముని హృదయమును వెల్లడి పరచును.

కాని, ఈగీతము లన్నింటిలో సుప్రసిద్ధి గాంచినవి సాగరగీతములే. సంద్రమును వీక్షించగానేయాతని హృదయసీమఁ బొడమిన మనోహరము లగుతలంపు లత్యద్భుతముగా నీకావ్యగీతములలో వర్ణింపఁ బడియున్నవి. ఆరంభము మొదలు తుదవరకు ఈగీత