పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13

అచ్చటనుండిన హోంరూల్ సంఘమునకు విస్తారు ధనము నొసంగి తన అసాధారణ ఔదార్యమును నాగపురవాస్తవ్యులకు దెలిపెను. ఇట్లే రంగూను కేగి హిందూ దేశరక్షక చట్టముక్రింద నిందితుఁడైన తనమిత్రుఁడు మెహెతాగారితట్టు వాదించి వారిని విడుదల చేయించుకొని వచ్చెను. వేయేల? ఉదాహరించినచో నిట్టి వనేకములను చిత్తరంజనుఁడు పూనికొని వాదించెను. ఈతఁడు అతివాదియైనను, సత్యసంధుఁడని సర్కా రెఱింగి మ్యునిషన్ సుబోర్డువ్యాజ్యమున నీతనిని సర్కారువారు తమతరఫు న్యాయవాదిగ నేర్పఱచికొనిరి. ఎదుటిపక్షపువర్తకులు లక్షలకొలది ధనము తనకొసగుటకు యత్నములఁ గావించినను ఆసందర్భమున చిఱునవ్వునవ్వి దొరతనమువారితట్టు తాను వకాలతుతీసికొని ఆవర్తకు లిచ్చుధనమును గైకొని వారిని నిర్దోషులనిచెప్పి వ్యాజ్యమును కప్పిపుచ్చుటకంటె అధర్మప్రవర్తన వేఱొండుండ నేరదనెను. చిత్తరంజనుఁడు అవమానము నెంతమాత్రము సహించనేరఁడు. మోమోటములేక న్యాయస్థానమున నిట్టి దేదైననుజరిగినచో వెంటనే న్యాయమూర్తితో మందలించును. అప్పటికిని న్యాయము కలుగనిచో కోర్టునుండి తాను వెడలివచ్చువాఁడు. డక్కా రాజద్రోహ కేసులో