పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

1-కి సుమారు 50. వేల రూప్యములను గడించుచుండెను. బంగాళారాష్ట్రమునందే గాక ఇతరరాష్ట్రముల యందు ననేక వ్యాజ్యములలో వాదించి శిక్షనొంద సిద్ధముగ నున్న వారిని విడుదలగావించెను. ఏవ్యాజ్యమున నేతట్టుబూనికొన్నను ఆతట్టు తనయావచ్ఛక్తిని వినియోగించి తనపక్షముయొక్క విజయమునకై పోరాడును. వ్యాజ్యమును వాదించునపుడు పరమేశ్వరునిగురించి ధ్యానించు యోగివలె గాన్పించునుగాని న్యాయవాదిగ గాన్పించఁడు. ఆతని కియ్యఁబడిన ఫీజును ఆతఁడు మరల కక్షిదార్ల కియ్య నవసరము లేదు. కాని, ధర్మాధర్మముల నాలోచించి తానెంతవఱకు ధనమును కై కొనవలయునో అంత మాత్రమే పుచ్చుకొని మిగిలినదానిని కక్షిదార్లకు మరల నిచ్చి వేయుచుండవాఁడు. ఈకార్యమువల్ల కక్షిదార్లచే పొగడ్తకు మిక్కిలి పాత్రుఁడయ్యెను. బీదవారి కేసులను ధనము కై కొనకయే వాదించువాఁడు. ఇట్టి కార్యములచే కీర్తి మెండయ్యెను. చిత్తరంజనుఁడు ఇన్ని వ్యాజ్యములను వాదించుచుండియు సమయము తటస్థించినపుడెల్లను స్వరాజ్యమును గురించి ప్రసంగించువాఁడు. నాగపురమున కొక వ్యాజ్యసందర్భమున నేగియుండి ఆవ్యాజ్యమున తనకు ధనమేమియు విస్తారము రాకున్నను