Jump to content

పుట:Chintamani Vol 2 August 1892.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చింతామణి.

వంటకముల సువాసనలు నన్ను మిక్కిలి మక్కువ పెట్టుచున్నవి! ఇండుగో ! వీరడొక్కఁడు కటికవాఁడో లేక వంటవాఁడేమో, కోసిన మెక పుఁజొట్టతి త్తిని ద్రాఁత గుడ్డనువ లెసుదుకు చున్నాఁడు! వేర్వేరు తీరులఁ దీరువు గాలి బీరు పేరు కూరలును సూపకారుఁడు కూరుచుచున్నాఁడు. కుడుములు పిసుకుచున్నాఁడు. అప్పములు పోయు చున్నాఁడు: (తనలో) ఇపుడిందుఁ బాల్పడినవన్నియు రండి తినుండయ్యాయని పాగోదక మిచ్చువారున్న నెంత లెస్స! (మరొక్క చక్కిఁ గాంచి) ఇందు వివిధా లంకార శోభితులగుచు గంధర్వ సురగణములట్లు గణికాజనులును బంధులగణ ములుకు బ్రోవై నిక్కమున కి నాగవాసపులోఁగిలి యానాకు వాసమె యనిపించు చున్నారు! ఓయీ! ఎవరు మీరు? వేశ్యాపుత్రులు గారా?

బంధులులు మేమా? -

ఉత్సాహ॥ పరపురుషుల వలనఁబుట్టి పడుపుఁదనపుఁ గడుపుల పరగృహము లందుఁదిరిగి పదులకూడు బొక్కుచుకో బరధనములు గోఁజు కొంచుఁ బలుక రాక గుణముల కా బరఁగుడుమిట గున్నలవలె బంధులులని పరువుతో.

ఐదూ - మఱియెచ్చటికిఁ బోదమమ్మా!

చేటి - రండి! దయచేయండి! ఇదె యాఱవనడవ! ఇందుఁ జేరుండి!

దూ - (చొచ్చి కన్నులువిచ్చి) అద్దితా! అద్దితా! ఈ యాఱవనడవయందును : రంగురంగుల దుఱంగలించు రతనంపుఁబసులు దోరణములు నీల వేదికలం గట్టఁ బడి యింద్రాయుధంబుచాయఁ జూపడె. వైడూర్యములు ముత్తియములుఁ బవడములుఁ బుష్యరాగములు నింద్రనీలములుఁ గర్కే తనరత్నములుఁ బద్మ రాగములు మరకతములు మొదలుగాఁ గల రత్నవిశేషముల నొండొంటిఁబోల్చి వాసి వన్నె లెన్నుచున్నారు విన్నాణంవు శిల్పులు. మాణిక్యములతో నొక్క యెడ బంగరు కట్టడములు చేయుచున్నారు. బంగరునగలు కాఁబోలు నెట్టిం దారముల ఘటించుచున్నారు, ముత్యాల పేరులు గూర్చుచున్నారు. వైదూర్యములకు సూటిగా బెజ్జములు పొడుచుచున్నారు. శంఖరులు మెఱుఁగు పెట్టుచున్నారు. మతి యు నితరస్థలములందుఁ బగడములు సానఁబట్టెదరు. తడికులకుమము తట్టలలో నెండఁబెట్టెదరు. కస్తూరిని గాలిపాఱఁ బెట్టెదరు. మంచి గంధము హెచ్చుగా ర దీసీ పరిమళద్రవ్యములతోఁ గలయఁగలి పెద్దరు. ఒకవంకంజూడ గణికా కాముకులకు సకర్పూరముగాఁ బాంబూల మొసఁగెదరు. క్రేఁగంటి చూపు లొలయిం త్రు కొందఱు. నవ్వెదరు పేఱు కొందలు. నిరంతరముగా సత్కరించుచు మద్య 74