Jump to content

పుట:Chintamani Vol 2 August 1892.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మృచ్ఛకటికము, నినివలెనే 'మేఁక మెడకాయముబట్టి మర్దించుచున్నారు! ఇయ్యెడనియ్యెడ లాఁతి గుఱ్ఱముల మెడ వెండ్రుకల (జలును) దువ్వుచున్నారు. ఇదిగో లాయమున గోతి యొండు డెక్కలికాని పోలిక గట్టిగాఁ గట్టి పెట్టఁబడియున్నది! ఇదిగో! ఈ వైపునఁ గన్ముని నేయి గాటు వరికూటి ముద్దలు మావటీండ్రందీయఁ జేయిగల మెక మాయనఁ గైకొంచున్నది!— ఇంక నెక్కడకుఁ గొంపోయెదు! పదవమ్ము !! చేటి — రావయ్య ! రావయ్య! ఇదిగోమూ ఁడవ నడవ చొచ్చెదువు గాని ! -(ప్రవేశించిచూచియు) వహవా! వహవా! ఏమీ ! ఈ మూడవ నడపనడుమ సుగూడ: ఆసించివచ్చెడు కులపుత్రజనులు గూర్చుండు నిమిత్తము పెక్కులస నములు సమకూర్పఁబడి యున్నవి యినిగో! ఆదిగో మళ్ళబల్లపై సగము చది విన నగల పొత్తము ధగధగలాడుచున్నది! ఇదియా? మణిమయములగు కారు. లతోడి పాచికల పీటగాదా! వీరందబు నెవ్వరోగదా? తెలిసినది వీరు. మదనతంత్ర పద్ధతిని సంధివిగ్రహోపాయములు నెఱపఁ జాతుర్యముగలిగి పలు రంగులు దించి చిత్తరువు వ్రాసిన బిత్తరి బొమ్మల పలకలు కైదండలంబూని యిటు నటు దిరుగులాడెడు గణికలును వృద్ధవిటులును. — ఇంక నెక్కడకమ్మా! చేటి ఇట దయ చేయవయ్యా! ఇదిగో నాల్గవఁడవ! ఇందుఁ జొరవయ్యా! విదూ—ఎంతయాశ్చర్యము! ఈ నాల్గవ చదురులో సయితము : యువతులు చేతులు వాయింపఁగా జలధరములట్లు మద్దెలలు మ్రోఁగెడును. పుణ్యము క్షయింప వే మింటనుండికూలు తారకలలాగునఁ గంచుతాళములు నడుచున్నవి. వెదురు క్రోవి మధుకరరుతముగతి మధురముగాఁ బలుకుచున్నది. ఇదిగో! ఈ దిక్కునఁ బొలయలుకఁ బొరసిన కామినిపోతే వీణ తొడపయి నిడుకొని వ్రేళ్ళ సవరణల చే సద్దువఱుపఁ బడెడును. ఇరుగో! ఈ బోగపుఁబిల్లలు పూఁ జీనియ నాని మత్తి ల్లిన యాఁడుతుమ్మెద కూనలవలె గొంతులెత్తి కరమింపుగఁ బాడుచు నృత్యము ద్రొక్కెదరు! నాట్యముసల్పెదరు! మఱియు, శృంగారరస ముప్పొంగ మెల్లన నడుగులు పై చెదరు! వీరలని దగ్గగోనెదరని గవాతము లందుఁ జిల్లా అనిల్పిన మంచినీళ్ళకడవ లివిగో! ఇంతట వెచ్చటికి? పోదము! - చేటి రండి! రండి! ఇదిగో! ఆయిదవది నడవ! ఈలోపలికిరండి! విదూ (వొచ్చి కనుఁగొని) ఆహాహా! ఈ యైదవదానిలోఁ గూడ: బీదజనముల కాసలు గొలుపఁజాలి యింగువనూనియల పొగుపులు మిన్నుముట్టి దెసలఁ బసగొని. వివిధ సురభి ధూమోద్గారములచే నిత్యసంతాపమొందు పానసపు సాల ద్వార ముఖములగుండ వెచ్చనూర్పఁబోలును! ఉడుకుచున్న పలురూపుల 73