59 చింతామణి. విదూ—(చూచి విసయపడి) ఆహె! ఏమి! వసంత సేనా భావన ద్వారపుఁ జెలు వపుసిరి! ముంగిటఁదుడిచి నీరు చల్లి పచ్చని పూఁత పెట్టి యత్తా వెల్ల నెత్తావుల గుప్పు పలుపూలతోఁ జిత్తరువుల ముగ్గులిడిరి. ఆకసమువిలోకించు బలుపు దీర్పఁ గరంచెత్తినది పోలె వాఁకిటిపొడవెత్తె తోచెడు. వేల్పు టేనుఁగు తొండ ములాయని బమ్మెరపుచ్చునట్లు వ్రేలుచుయ్యాలలూగు మల్లెజమిలిదండ లెంత సొబగు దెచ్చుచున్నవి ! పొడుగాటిదంతి దంతముల తోరణము లెంతవింతగొల్పే డు! అంతకును మెఱుఁగు గూర్చు కుసుంభపుష్పవర్ణపు సౌభాగ్యపతాకల చారు గాలివాటున నూఁగులాడుచుఁ దఱంగలించు నంచుకొనలను చేతుల సన్నల మెయి నన్నిటు రమ్మని హెచ్చరించుచున్న చెన్నుగనిపించాడు. దోరణము మా చెకు సభావేదిక కుభయ పార్శ్వములను నిలిచెడు స్ఫటికమయ మంగళ కలశ ము లాకుపచ్చని క్రొమ్మని చివుళ్ళ సవురును వెద చిమ్ముచు నెంతయభిరామమ్ము లుగా నున్నవి! మహాసురవక్షఃస్థల సుర్భేద్యములగు వజ్రముల చేనిరంతరము గా ఁ బ్రతిబద్ధములు గదా యీ కనక కవాటములు! ఇట్టిదికనుకనే యిది దుర్గత జన మనోరథముల కాయాసకరము. త్రోవనుబోవు నుదాసీనునికిని దనుజూడమలపఁ గూడని వేడుక గలిగింప వలఁతియగు. బళె! చేటి—పదవయ్యా! పదవయ్యా! ఇదె మొదటినడవ చదురులోఁ బ్రవేశింపవయ్య! విదూ—(చొచ్చిచూచి) ఏమి! ఏమి! యీయాశ్చర్యము! ఈ వీధినడవలో సయి తము శశిశంఖ మృణాళములచాయ నైనయుచు నెర్లెడం గూర్చిన చూర్ణ ముష్టి రంగవల్లులచేఁ చెల్లపై తెగతెగల మగతాలు చెక్కిన నిగనిగని బంగరు మెట్లు గల మేడలచారులు తూఁగాడు ముత్తెవుఁ జేరుల పౌరుకొను స్ఫటిక గవాక్షము ల నెడి ముఖచంద్రములతో నజ్జయినీపురిని చెప్పలార్పక పాఅఁ జూచుచున్న వానివలేఁ దోఁచుచున్నవి. ద్వారపాలకుఁడు శ్రోత్రియుని పగిది సుఖముగాఁ గూరుచున్నాఁ డఁడుగో! మంచి పెరుగుతోడి కలమాన్నముల మరిగి వాయస ములు చూర్ణ స్వర్ణమని కాఁబోలును బల్యన్నమును భక్షింపరావు చూడు! తరువాత దారిచూపు! చేటి—రండి! రండయ్యా! ఇదిగో రెండవ నడవలో నడుగిడుఁడు. విమా—— ఈ రెండవ చదురులో, నూ వెనాన్చిన కొమ్ములు గల గవిసెనబండి యెద్దులు చేరఁ దెచ్చిన పచ్చికను దవుడును గబళించి బలిసి కట్టు మట్టల నా ముచూ పైడు! ఇదిగో! పోతరించిన యీదున్న యవమాన పడి చెన్ను దక్కిన కులీనునిమాడ్కి దీర్ఘముగా విశ్వసించుచున్నదిగదా! ఇక్కడ! కాలనికి వెఱచిన పాలుపోతుకూరు 72
పుట:Chintamani Vol 2 August 1892.pdf/7
స్వరూపం