మృచ్ఛకటికము. శర్వి - మంచిదానవు ప్రియురాలా! సాధు! ఆస్మ చిత్తసదృశముగ సంభాషిం చెదవు! (చేటునితో) భద్ర! సార్ధవాహుఁడగు రేఖిలుని భవంతి తెలియునా నీకు చేటు — అయితే ఏమి? శర్వి — నాప్రియురాలి నచట దిగవిడువుము. చేట — సరే! మీయాజ్ఞ చొప్పున. మద — పూజ్యులగు మీరానతిచ్చినట్లే. మీరుమాత్రము ప్రమాదపడక సంచరింప వలెనుజుండీ! (అని నిష్క్రమించెను.) శౌర్వి — నేనిప్పుడు: చ|| తమ భుజవిక్రమంబున సదా శ్రుతికెక్కినవారి నెల్లరక్షా సమకులజాతులకా విటుల క్ష్మాపతి భృత్యులరా డవజ్ఞమైం గమీ రేడువారి నూల్కొలిపి ట్రక్కువ మిత్రుచెఱల్ వదిల్చేద తమమును వత్సరాజును యుగంధర వంశ్యుఁ డొనర్చినట్లుగా, ఇదేకాక. క॥ ప్రియసుహృదున కారణముగం బయికొనియు న సాధువృత్తి భయపడురి పులక్షా నియమించి విడుపుగూర్చెద : జయకరమగు రాహు ముఖగ చంద్రు విధమునక్. (అని నిష్క్రమించెను.) చేటి—(ప్రవేశించి) ఆమ్మా! నీపుణ్యము పండినదిలే! పూజ్యులగు చారుదత్తునిగారి సన్నిధినుండి బ్రాహ్మణుఁడొక్కఁడు వచ్చినారు. వసం—ఆహా! ఈదిన మిప్పు డెంత రమణీయముగా నున్నది! కాఁబట్టి, ఓసీ! ఆ యనను బంధులునితో ఁబాటు సాదరముగా లోనికి రానిమ్మీ! చేటి—మీని తమువచ్చినట్లు చేసెదను. ( అని వెళ్ళెను.) (విదూషకుఁడు బంధులునితోఁ గూడి ప్రవేశించుచున్నాఁడు.] విదూవహవా! వహవా! ఏమీ యీ యాశ్చర్యము! తపశ్చరణ క్లేశములచే డఫ్సీ డస్సీ తొల్లి రాక్షసరాజు రావణుఁడు పుష్పకవిమానముతోనే వెళ్ళుచుండెడు వాఁడు: నేనో బాపనవాఁడను దపశ్చరణము సలిపి వేశ పడకుండ నే నగర నారీ జనముతో వెళ్ళఁబుచ్చుచున్నాఁడను. చేటి—అయ్యా! మాగృహద్వారమును గనుగొండి! 71
పుట:Chintamani Vol 2 August 1892.pdf/6
స్వరూపం