хо చింతామణి.
దనురాని దగ పడచు, బలు
గొనమే యుడుపతిని శివుని కొనతలఁ జేర్చెం.
వసం—ఎవఁడురా అక్కడ గవిసెనబండిఁ ద్రోలువాఁదూ!
చేటు — (బండిఁదెచ్చి) ఆమ్మా! బండియాయితము!
వసం—చేటీ! మదనికా! నాపయి మంచిదృష్టి నిలుపు ! నిన్నిచ్చితిని! బండి సుక్కు!
నన్నుఁ దలఁచుము |
మద— (కన్నీరునించి) అమ్మ గారు నన్నుఁ బరిత్యజించి రా? (అని కాళ్ళపైఁ బడు
చున్నది.)
వసం — ఇయ్యెడ నీకే నేను వందనము చేయఁదగును! కనుకఁ జనుము! బండి
యెక్కు ము! నన్ను స్మరియింపుము!
శర్వి—నీకు శుభమగుఁగాక మదనికా!
క॥ ఎవ్వరిదయ మెయినరుదుగ
జవ్వని వధువ నెడి మాటలని గవిసెనగా
నవ్వనిత నియమంగను
మవ్వముగాఁ జేయుమీ నమస్కరణంబుల్.
(ఇట్లు మదనికతోఁ గూడి ప్రవహణ మెక్కి పోనున్న యెడ)
(తెఱలో) “ఎవ్వరెవ్వరిక్కడ! వినుండి! గోపాల బాలకుఁడుగు సియార్యకుఁడు
రాజుగాఁగలఁడని చెప్పిన సిద్ధుని యాదేశంబున నమ్మకముగూరి వెఱపొంది..
మనరాజు పాలకుఁడుగారు గొల్లపాలెమునుండి యావానిని రావించి యిదిగో
ఘోరమగు బంధనాగారమునఁ గూల్చినారు: కావున, మీరెల్లరు మీమీ స్థాన
ములందుఁ బ్రమాదములేక సంచరించుకోండి!" అని రాజశ్యాలకుఁడు రాష్ట్ర
యుఁ డాజ్ఞాపించుచున్నాఁడు సుండీ!
శర్వి — (విని) ఏమీ ! నా ప్రియసుహృదుఁడగు నార్యకు నింబట్టి పాలక రాజు చెఱఁ
బెట్టినాఁడా! కళత్రవంతుఁడను గూడ నైతినే! అః! ఏమికష్టమువచ్చెను! పోనీ!
క॥ నరులకు లోకములోఁ బ్రియ
మరియఁగ నిద్వయము సుహృదుఁ డంగనయును; నీ
యిరుడెఱఁగు లోపలను సుం
దరీశతమునకు విశిష్టతరుఁడు సుహృత్తే.
కానీ దిగియెదను. (అని దిగుచున్నాఁడు.)
మద—(సాత్రువై యంజలి చేసి) ఇట్లు తగదు: నన్న మీఁదికిం గొంపోయి మీరే మీ
పెద్దలకు జూపుండి!
70