Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90 చిన్ననాటి ముచ్చట్లు

శివ శివ గణనాధా! - నీవు -

శివుని కుమారుడవు! - గణ నాథా!

అను ప్రార్ధన పాటతో కోలాటము ప్రారంభింతురు. ఆ పిమ్మట

'కోలుకోలన్న కోలు, కొమ్మలిద్దరు మంచి జోడు

పల్లెటూళ్లలో జంగము కథలను చెప్పుచుండేవారు. ముఖ్యముగ బాలనాగమ్మ కథ, బొబ్బిలి కథ, దేశింగురాజు కథ, కాంభోజిరాజు కథ మొదలైన వానిని జంగములు చెప్పుచుందురు. ఆ రోజులలో ఈ కథలను చాల చాకచక్యముగ చెప్పగల్గిన వారుండిరి. ముఖ్యముగ మా గ్రామసమీపమున గల ధేనువుకొండ గ్రామమున ధేనువకొండ వెంకయ్యగారను ప్రసిద్దమగు సంగీత పాటకులు వాగ్గేయకారులు ఉండేవారు. ఆయన జంగం కథలను స్వయముగ వ్రాసి తాను ప్రక్కన నిలిచి లయ తప్పక అడుగువేయుచు శిష్యులకు నేర్పేవారు. ఆ శిష్య పరంపర నేటికిని ఆ ప్రాంతమున కలదు. ఈ జంగం కథలు చెప్పునప్పుడు కథలో ఆయాపట్టులకు తగినట్టు రసముట్టి పడ, హుంకరింపులు, పాదఘట్టనములు, హెచ్చరికలు, మున్నగువాని నొనర్చుచు, ముందు వెనుకలకు లయ తప్పక నడుచుచు, దుముకుచు, భుజమున పెట్టుకొన్న తంబురను కుడిచేతి వ్రేళ్లమీటుచు, ఎడమచేతి వ్రేళ్లకు పెట్టుకొన్న బోలుకంచు ఉంగరములతో తంబురకుండపై దరువువేయుచు పాటపాడుచు నొకడు కథ నడుపుచుండెను. అతని కిరువంకల ఇద్దరు గుంసీలు తీసుకొని వాయించుచు వంతుపాట పాడుచు అతనితో నడుచు చుందురు. పాట మధ్య మధ్య నిల్పుచు, ఆవంతు పాటగాండ్రిరువురు ప్రశ్నోత్తరములలో కథను వ్యాఖ్యానమొనర్చుచుందురు. ఈ సందర్భముననే వారు హాస్యమును చెప్పుదురు. అయితే సామాన్యముగా నిది మోట