చిన్ననాటి ముచ్చట్లు 83
నోటనున్న గుంటూరుమెట్ట (పాటి) పొగాకు (బారెడు) చుట్టను త్రాగుచున్నట్లుగానే "ప్ప-ప్ప-ప్ప-ప్పప్పా" అని ఎద్దుల నదలించుకొనుచు వారు బహు చలాకీగా సారధ్యమును సాగింతురు. ఆ మాత్రము అదలింపైన సహింపనట్లుగా ఆ కోడెలు రోషావేశమున పరవళ్లతొక్కుచు విసురుగా ముందుకు సాగిపోవుచుండును. అట్టివానిలో బాగుగా పొగరుబోతులైన కోడెలకాళ్లకు గిట్టలపైన త్రాళుకట్టి ఇరువంకల చేతబట్టుకొని, అదలించి వానిదుడుకును నిగ్రహించుచు ప్రాయము వ్రాలుచున్న పెద్ద రైతులు నడుస్తుంటారు. ఈ బండ్లు మా ఊరిగుండా పోవునప్పుడు వూరిలోనివారు ఈ ప్రభల కెదురేగి నిల్పి సత్కరించుచుండిరి. స్త్రీలు బుంగల కొలది నీరు తెచ్చి వారు పోయుటయు పురుషులు కత్తిపట్టుకొని దండకములు, ఖడ్గములు - అను తెనుగు రచనలను ఆ వేశముతో 'అద్దద్దశరభ" యని ఊతముతో చదువుటయు నాకింకను జ్ఞాపకము. సామాన్యముగ నీ ఖడ్గములను దండకములను చదువువారు జంగములు, బ్రాహ్మణులగు అరాధ్యులు. వీనికి కథపట్టు సామాన్యముగా దక్షయజ్ఞ ధ్వంసమును శివలీల లేక వీరభద్రుని వీరవిహారము. మచ్చున కొక్క చరణము :
దక్షుని తలగొట్టి తగరు తలపెట్టి
అద్దద్దద్దద్ద శరభ - శరభ"
ఈ పాడేవారు ఒక కత్తిని చేతపట్టుకొందురు. లయతప్పక ముందు వెనుకలకు నడుచుచు, గంతులు వేయుచు, పరవళ్లు త్రొక్కుచు పాడుదురు. ప్రక్కన నొకడు చల్లగా రుంజ వాయించుచుండును. మరొకవంక నొకడు - సామాన్యముగా నితడు ఎడమవైపు నుండను - డోలునో, కనకతప్పెటనో వాయించుచుండును. అతంతంల నిలిచినవారు కొమ్ములు, కాహళములు అదునుచూచి ఊదుచుందురు. సమీపస్తుడై మరొక్కడు రసముట్టి పడుపట్టున శంఖమొత్తును. ఇట్టి సన్నాహమధ్యమున - ఆ వీరుడు, - ఖడ్గము నందలి యొకటి రెండు చరణములు చదివి - ఉసితో ఆ డోలు