77 చిన్ననాటి ముచ్చట్లు
11
మా ఊరు
నేను చిన్నతనమున మద్రాసుకు వచ్చిన పిదప అప్పుడప్పుడు మావూరగు ఇనమనమెళ్ళూరికి పోవుచుంటిని. రైలు సౌకర్యము లేనప్పుడు ఉప్పు కాలువ (Buckingham Canal) లో పడవల మీద ప్రయాణమును చేయుచుంటిని. ఆ కాలమున మద్రాసులో బోటు యెక్కిన కొత్తపట్నం రేవుకు 10, 12 దినములలో చేరుచుంటిమి. బోటు చార్జి మనిషికి ఒక రూపాయి మాత్రమే. అయితే ఈ ప్రయాణమునకు కావలసిన భోజన పదార్ధములను చిరుతిండ్లను సమృద్దిగ తీసుకొనిపోవలయును. వంగవోలు ప్రాంతముల నుండి వచ్చినవారు కొందరము చేరి యీ పడవ ప్రయాణమును చేయుచుంటిమి. ఇందు స్త్రీలు, పురుషులు, బిడ్డలు యుందురు; పడవ నడుపు సరంగులుందురు. దక్షిణపుగాలి యుండిన, పడవకు చాప నెత్తిన, పడవ వేగముగ పోవును. ఈ చాపను ముతకగుడ్డతో తయారుచేయుదురు. గాలి లేనప్పుడు పడవ సరంగులు గడలను వేయుచు పదములను పాటలను పాడుచు పడవను నడిపించెదరు. గడలను వేసి అలసినప్పుడు బోటుకు మోకును గట్టి లాగుకొనిపోయెదరు. కొన్ని సమయములందు ప్రయాణీకులుగూడ పడవ దిగి సరంగుతో కూడ పడవమోకును లాగుచుండెదరు. ఉప్పుగాలి సోకుటవలన ఆకలి అమితముగ నుండును. నీళ్లవసతిగల చోటుచూచి వంటచేసుకొనుటకు పడవను నిలిపెదరు. మేము పడవను దిగి సమీపమున యుండు మంచినీళ్ల బావివద్దకుపోయి స్నానము చేసి. చెట్టుచాటుననో, గుట్టచాటుననో పొయ్యిబెట్టి, పుల్లలను యేరుకొని వచ్చి అన్నమును మాత్రము వండుకొనువారము. గాలివలన మంట తప్పెలకు సరిగ తగలనందున కొన్ని సమయములలో అన్నము సరిగ పక్వముగాక