చిన్ననాటి ముచ్చట్లు 75
బ్రాహ్మణార్ధపు బ్రాహ్మణులు, ముత్తయిదువులు, దానములను పట్టువారు వీరందరూ కూడ అక్కడ హాజరుగ నుందురు. పది కర్మాంతరములకు సరిపోవు వారందరు ఇక్కడ సులభముగ లభించెదరు. కర్మచేయు యజమాని స్నానము చేయుటకు ఇక్కడ గుంట గలదు. పురోహితునకు కావలసిన దర్బ ఈ తోటలోనే పెంచుదురు. సమిథల పుల్లలు దొరుకు వృక్షములన్నియు ఈ తోటలోనే యున్నవి. శిలాప్రతిష్టకు మంచిరాళ్లు యిక్కడనే దొరకును. కర్మనంతయు కంట్రాక్టుకు తీసుకొని జరిపించే పురోహితులుకూడ ఇక్కడ వున్నారు. నిత్యకర్మ చేయునప్పుడు పిండమును తినుటకు చనిపోయినవారిని స్మరించి కాకులను పిలువనవసరము లేదు. ఇక్కడనే చెట్టమీద వేలువేలు పెంపుడు కాకులున్నవి. ప్రతిదినము పిండములను తినుచు చెట్లమీదనే కాపురము చేయు ఈ కాకులు బలిసి యుండును.
మద్రాసులో, భర్త చనిపోయిన స్త్రీని కాపురముండు యింటికి రానివ్వరు. గనుక ఈ స్త్రీలకు బ్రహ్మతీర్ధమునగల ఇండ్ల చాలా వసతిగను మహోపకారముగను నున్నవి.
ఈలాటి ధర్మములను చేసిన పుణ్యపురుషులే నిజముగ సంఘసేవకులు. ఈ సందర్భమున ఒక చిన్న విషయము.
బరంపురం కాపురస్తులగు మారెళ్ల గంగరాజుగారు మద్రాసుకువచ్చి డాక్టరు రంగాచారి నర్సింగుహోములోచేరి వ్రణచికిత్సను పొందుచుండిరి. వారి వ్రణమును ఆపరేషన్ చేసిన పిమ్మట ఆ నర్సింగుహోములోనే వారు చనిపోయిరి. వారి భార్య, కొడుకు వగైరాలు వారితో కూడనే మద్రాసు నందుండిరి. వారి బంధువులు కూడ మద్రాసులో కొందరుండిరి. గంగరాజుగారు నాకు స్నేహితులగుటవలన నేనుకూడ ఆ సమయమున