చిన్ననాటి ముచ్చట్లు 73
శీలసంపత్తి మున్నగునవియున్నూ స్పష్టమగుచున్నవి. తండియార్పేటలోని సత్రమున ఆ రోజులలో 160 మంది పరదేశీలను, విద్యార్ధులను, 60 మంది నౌకర్లను మూడుపూటల ఇష్టమృష్టాన్న భోజనమున తృప్తుల గావించుట కేర్పాటు చేయబడియుండెను. ఇచ్చట విద్యార్థులకు భోజనముపెట్టి, పండితులచే వేదశాస్త్రములను చెప్పించేవారు. తిరువళ్ళూరు, కాంచీనగరము లందలి ధర్మసత్రములందు 12 సి మంది బ్రాహ్మణ బాలురు భోజనవసతి గల్గి వేదాధ్యయన మొనర్చుచు, ధర్మశాస్త్రములను పఠించుచుండిరి. ఆ వీలునామా యందంతటను శ్రీరామనామస్మరణ విరివిగా చేయబడినది. పవిత్రమైన శ్రీరామనామ మాహాత్మ్యమువల్లనే మనవంశాభివృద్ధి. మన పూర్వులచే స్థాపింపబడిన ధర్మాభివృద్ది సాగుచున్నవి. ఆ రాముడే మీకు భవిష్యత్తునందు సంరక్షకుడు. నిరంతరము రామనామము జపమొనర్చుటకై ఇద్దరు బ్రాహ్మణులను మనయింట ఏర్పాటుచేసియున్న సంగతి మీకు తెలియును. మీరును అట్లే నిరంతరము శ్రీరామనామజపము గావించు బ్రాహ్మణులను ఏర్పాటు చేయవలసినది' అని ఆవీలు నందు వ్రాసి యున్నారు. ఈ సత్రము పరిపాలన విషయమై కోర్టువారును ఒకటి రెండు సార్లు జోక్యము కల్పించుకొని స్కీములు నిర్మించియున్నారు.
ఇట్టివే, అన్నసత్రములు మరికొన్ని మద్రాసు చుట్టుప్రక్కలనున్నవి. తిరవత్తియూరు నందు, తిరువళ్ళూరు నందు యాత్రికుల వసతి కొరకు ఎన్నయినా సత్రములున్నవి.
పూర్వము చెన్నపట్నం సమీపమున కొండూరు అని ఒక చిన్నస్టేషన్ ను ఉండెడిది. ఆ ఊరినే ఇప్పుడు విల్లివాకము స్టేషనుగ మార్చినారు. ఈ కొండూరు నందు విశాలమైన ధర్మసత్రములున్నవి. ఇక్కడొక బావినీరు చాలా ప్రశస్త్రమైనదని ప్రతీతి. అందుచే మద్రాసునుండి అనేకులు అచ్చటికి