72 చిన్ననాటి ముచ్చట్లు
మహారాజులు, జమీందారులు, లక్షాధికార్లు. ఈ ఖాతాదార్లు మద్రాసుకు వచ్చినప్పుడు నివసించుటకు వీరు టాకరు గార్డెన్ యను గొప్ప బంగాళాను నిర్మించిరి. మద్రాసుకు వచ్చిన రాజులు ఆ భవనమున కొంతకాలము బసచేసి పోవు సమయములో టాకరు కంపెనీవారు వార్లకు అమూల్యములగు కొన్ని ఆభరణములను విక్రయించెదరు. ఆభరణములకు వెల కంపెనీవారు నిర్ణయించినదే. ఈ ప్రకారము వారు కొన్ని సంవత్సరములు కోట్లకొలది వ్యాపారమును చేసి కడపట కంపెనీని మూయవలసి వచ్చినది.
మోసస్ కంపెనీ మౌంటురోడ్డులో యుండెను. వీరు రాజులకు మహారాజులకును కావలసిన స్టేటు డ్రస్సులను (State Dresses) వెలగల యితర వుడుపులను కుట్టించి వారికి సప్లయి చేయుచుండెడివారు. ఈ కంపెనీకి స్వంతదార్లు వైశ్యులలో పేరుపొందిన శీతారామశెట్టిగారు. ఈ కంపెనీవారు రాజులకు ఉడుపులను కుట్టి లక్షలాదులు సంపాదించిరి. టాకరు కంపెనీవారు ఆభరణములను, మోసస్ కంపెనీవారు ఉడుపులను రాజులకు సప్లయిచేసి పేరుప్రతిష్టలు గడించిరి. కొంతకాలమునకు వీరును షాపు తలుపులను మూసిరి.
తిరువత్తియూరు హైరోడ్డులో తంజావూరు రామానాయుని సత్రమును, దానినంటి అగ్రహారమున్నూ గలవు. ఈ రామానాయుడు చాల బ్రాహ్మణభక్తిపరుడు. దైవభీతి కలవాడు. ఇచ్చట తండియార్పేటలోనే గాక తిరువళ్ళూరు, కాంచీనగరములందును ధర్మసత్రములను వేసియున్నాడు.
రామానాయుని కుమారుడు రంగయ్యనాయుడుగారు 1822 సం|| డిశంబరు 7వ తేదికి సరియైన చిత్రభాను సం||రము కార్తీక బహుళ నవమినాడు తెలుగులో వ్రాసియుంచిన వీలునామా చూడగా వారి దానధర్మములను, రంగయ్యనాయుడుగారి బ్రాహ్మణభక్తి, దైవభీతి,