56 చిన్ననాటి ముచ్చట్లు
వెక్కసముగనున్నను పలువురు సామాన్యల కానందదాయకమై యుండెడివి. కండ్లుకు సుర్మా, పండ్లకు దాసిన, కొప్పున పూలు ధరించి, నడుమునకు పావడ గట్టుకొని కులుకుచు, నవ్వుచు పురుషులతో సరసము లాడుచు, మొగమొక్కట్లు, ఆడుచందములుగల వీరు హాస్యనిలయములై యుందురు. ఇద్దరు ఎరుకల స్త్రీలు తాటాకు గిలకలను అమ్ముకొనుచు, వీధులలో మూతులు పొడుచుకొనుచు సవతులు జగడమాడు దృశ్యమును చూపి చూపరుల వినోదపరచి బియ్య మడుగుకొనేవారు. గారడి విద్యలను, దొమ్మరి ఆటలను మద్రాసు నడివీధులలో చూపి బిచ్చమెత్తువారు కొందరు వచ్చుచుండిరి. పగటివేషములు వేసుకొని మోటహాస్యమును చెప్పుచు బిచ్చమునకు వచ్చువారును కన్పించుచుండిరి. అప్పుడప్పుడు ఆంధ్రదేశము నుండి మరుగుజ్ఞు వస్తాదులు కొందరువచ్చి కఱ్ఱలు, కత్తులు త్రిప్పుచు సాముగరడీలను చేసిచూపి బిచ్చము అడిగేవారు. ఒక జంగం భద్రప్ప పెద్దగంటను చేతపట్టుకొని, మరియొక చేత ఆ గంట అంచును పుల్లతో చుట్టుచుండగా గంట నాలుక గణగణకొట్టుకొను దృశ్యము చూడ చిత్రముగా నుండెడిది. ఒక తెలుగు బిచ్చగాడు బొద్దికూర అమ్ముచు - "బొద్దికూర తిన్నవారు బుద్ధిమంతులు అగుదురు; చక్కిలాలు తిన్నవారు చచ్చిపోదురు" - అనే పాట పాడుకొంటూ తిరిగేవాడు. అతడు యతి కొరకట్లన్నాడేగాని ఇది వాస్తవము కాదు. కాలిమీద మాంసం తునకను పెట్టి కట్టుకట్టుకొని పరుండి లేవలేనట్లుగ అభినయించు బూటకపు బిచ్చగాండ్లను మరి అనేక కృత్రిమ బిచ్చగాండ్లను అప్పటినుండి యిప్పటివరకు ముక్కోటియేకాదాశినాడు మద్రాసు దేవాలయములలొ చూచుచునే యున్నాను.
మద్రాసులో పీనుగలను మోయు వృత్తి నవలంబించిన వారి జట్టులు గలవు. అందరికి వలెనే వారికిని ఒక సమితి గలదు. ఈ సమాజము