పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54 చిన్ననాటి ముచ్చట్లు

ఆరోజులలో జార్జిటౌనునందు తలంటి స్నానము చేయించు జెట్టివాడొకడుండెను. అతని పేరు రామదాసు. ఇతడు లావుపాటి భారీమనిషి, నల్లగా పోతవిగ్రహమువలె నుండువాడు. నుదుట వెడల్పాటి నామమును ధరించి రామనామస్మరణ జేయుచు వరదాముత్తియప్పన్ వీధి (వరదాముత్తియప్ప అనే తెలుగు వైశ్యుని పేర నీ వీధి వెలిసినది. ఇతడు 18వ శతాబ్దములో నొక వర్తకుడు. తెలుగులోనే రికార్డులలో దస్కతు చేసి యున్నాడు) యందు కూర్చుండి యుండువాడు. అతడు వచ్చి తలంటిన ఆ కాలమున గొప్ప గౌరవము. వాడు చక్కగా వళ్లుపట్టి రామదాసు కీర్తనలను శ్రావ్యముగా పాడుచు దరువుతో తలంటేవాడు. ఇతడందరికి సులభముగా దొరికేవాడు కాడు. ఇతనికి చార్జి రూ. 0-4-0 మాత్రమే. ఆ రోజులలో తలంటి వళ్లుపట్టు జెట్టీలు అనేకులుండిరి గాని ఈ రామదాసుకుండిన పేరు, గిరాకి వారికి లేదు.

మరియొకడు చెవిలో గుబిలిని తీసి మందువేసిపోయేవాడు. వీడు రెండుచెవులపైనను గుబిలి కడ్డీలను, దూదిచుట్టిన పుల్లలను పెట్టుకొని వీధి వీధికి తిరుగుచుండేవాడు. చెవులలో వేయు మందుకూడ వీనివద్దనే యుండేది. ఇట్టివారిని నేడును మనము చూడవచ్చును. వీరిలో కొందరు రాళ్లను కూడ తీసి హెచ్చురేటు పుచ్చుకొనువారు. అసలు చెవులో రాళ్లు ఉండవనియు, వీరే హస్తలాఘమున గుబిలి తీయునపుడే చిన్నరాళ్లను చెవులలో వేసి పిదప తీసి చూపుచుందురనియు అందురు.

మద్రాసులో ముందు సోమరివారు అనునొక జట్టు యుండెడిది. పనిలేనివారు, పోకిరివారు, తల్లిదండ్రలు లేనివారు, ఇండ్లనుండి వెళ్లకొట్టబడిన వారు వీరందరు యీ సోమరి జట్టులో చేరుచుండిరి. మద్రాసులో పెండ్లి పేరంటములు జరుగు ఇండ్లకుపోయి పుల్లాకుల (ఎంగిలాకులు)లోని