50 చిన్ననాటి ముచ్చట్లు
మీద మునీశ్వరుడు (మొగదెయ్యం) కూర్చుండి కదలించుచున్నాడని భయపడుచుండెను. తెల్లవారగనే ఆ మునీశ్వరునకు పాలుపొంగలివెట్టి మొక్కుచుండును. ఇందువలన మా యింటికి మాంత్రికులు, తాంత్రికులు వచ్చి తాయెత్తులను, రక్షరేకులను కట్టిపోవుచుందురు. ఈమె మెడ నిండుగ యివి వ్రేలాడుచుండును.
ఈ విధముగా తెనుగుతల్లి సంసారమును సాగించుచుండెను. అయితే ఈ పట్టణములో నాకు వచ్చు స్వల్పవరుంబడిలో ఈ దుబారా సంసారమును నేనెట్లు గడపగలిగితి నాయని పాఠకులు సందేహపడవచ్చును. ఆ కాలమున మద్రాసులో ఇస్తిరి చొక్కాయి, తలగుడ్డ ధరించుకొనిన వానికి అంగళ్లలో అప్పు పుట్టుచుండినది.
8
ఆనాటి చెన్నపట్నం
నేను చిన్ననాడిక్కడికి వచ్చినప్పుడు చెన్నపట్నము ఈ స్థితిలో లేదు. ఎన్నియో మార్పులు నాకండ్ల యెదుటనే జరిగిపోయినవి.
ఆ రోజులలో సముద్రమునకు కోటకు మధ్య ఇంతదూరము కాళీస్థలము లేదు. సముద్రపు అలలు దాదాపు కోటగోడల వరకు వచ్చి కొట్టుకొనుచుండేవి. కోటచుట్టు ఉండే అగడ్తలనిండా నీరుండేది. ఇప్పడు స్వరాజ్య పతాకము ఎగురుచుండు స్తంభముననే అప్పుడు ఆంగ్లేయుల యూనియన్ జాక్ ఎగురుచుండెడిది. కోటయొక్క అన్ని ముఖద్వారము