చిన్ననాటి ముచ్చట్లు 49
భోజనమునకు కూర్చున్నారు. నెయ్యిని వడ్డించవలయును. సత్తు నేతి తప్పెలను నా భార్య పొయిమీద పెట్టినది. అది సత్తుతప్పెల అయినందున అడుగుకరిగి నెయ్యి అంతయు పొయిలో పడి భగ్గునమండెను. ఆ మంట పెద్దదగుట వలన నా భార్య భయపడి దిక్కుతోచక ప్రక్కకూటములో నిలుచున్న మంగళాంబను గట్టిగా కౌగలించుకొని కండ్లు మూసికొనినది. మంగళాంబ దిగ్భ్రమ చెంది వంటయింటిలోకి వచ్చి చూచినది. సత్తు తప్పెల కరగి నెయ్యి పొయిలో పోయినదని ఆమె గ్రహించినది. విస్తళ్ళ ముందర కూర్చున్న బ్రాహ్మణులు చారలు జాపుకొని కూర్చున్నారు. అరవవారింట అప్పుదెచ్చి వడ్డించుటకు వారింట నెయ్యి లేదు. వచ్చిన నిమంత్రణ బ్రాహ్మణులు అరవవారైనందున నూనెతోనే భోజనమును ముగించుకొనిపోయిరి.
ఆనాడు మంగళాంబ కూడ మా యింటనే భోజనము గనుక ఇరువురు యిల్లాండ్రు భోజనమునుచేసి తీరికగ కూర్చుండి తాంబూలమును వేసుకొనుచుండునపుడు మంగళాంబ గారు మా ఆబిడను 'ఎందుకమ్మా నీవు నన్ను కౌగలించుకున్నది?' అని నవ్వుచు అడిగినది. 'ఆ పెద్దమంట చూడగా నాకు భయము కలిగి అట్లు చేసితినమ్మా' యని ఈమె దీనముగ జవాబు చెప్పెను. 'అయితే సత్తు తప్పెలను పొయిమీద పెట్టిన అది కరిగిపోవు సంగతి నీకు తెలియదా' యని అరవతల్లి అడిగినపుడు 'నేను దినము ఆ తప్పెలతోనే చారు పెడుతున్నందున పొయిమీద పెట్టితి'నని తెలుగుతల్లి జవాబు చెప్పినది.
ఈ తెలుగుతల్లి చాలా భయస్తురాలు. రాత్రిళ్ళు యింటిలో పిల్లులు చప్పుడు చేసినప్పుడు దొంగలు వచ్చిరని జెప్పును. మా యింటి ప్రక్కయింటి దొడ్డిలోవున్న పెద్దరావిచెట్టు రాత్రిపూట గాలికి కదలిన దాని